Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీర్‌బాబు సొంత బ్యానర్లో సినిమా - మే 26న లోగో ఆవిష్కరణ!

ప్రేమ‌ క‌థా చిత్రం’, ‘భ‌లే మంచి రోజు’, ‘కృష్ణమ్మక‌లిపింది ఇద్దరినీ విభిన్న ప్రేమ‌ క‌థా చిత్రాల్లో న‌టించి.. విజ‌యం సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ‌ హీరో సుధీర్‌బాబు. బాలీవుడ్‌లో ‘బాఘి’ అనే చిత్రంలో విలన్‌గానూ మెప్పించారు. అయితే..

Webdunia
గురువారం, 24 మే 2018 (20:47 IST)
ప్రేమ‌ క‌థా చిత్రం’, ‘భ‌లే మంచి రోజు’, ‘కృష్ణమ్మక‌లిపింది ఇద్దరినీ విభిన్న ప్రేమ‌ క‌థా చిత్రాల్లో న‌టించి.. విజ‌యం సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ‌ హీరో సుధీర్‌బాబు. బాలీవుడ్‌లో ‘బాఘి’ అనే చిత్రంలో విలన్‌గానూ మెప్పించారు. అయితే... ఇప్పుడు సుధీర్‌బాబు నిర్మాత‌గా మారారు. సుధీర్‌బాబు ప్రొడ‌క్షన్స్ పేరుతో బ్యాన‌ర్‌ని ప్రారంభించారు. ఈ ప్రొడక్షన్ హౌస్ లోగోను ఈనెల‌ 26న సినీ ప్రముఖుల స‌మ‌క్షంలో వైభ‌వంగా ప్రారంభించనున్నారు. 
 
ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. నిర్మాతగా మారి వరుస చిత్రాలను నిర్మించడానికి సుధీర్‌బాబు సన్నాహాలు చేస్తున్నారు. తన సొంత బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 1గా ఇప్పటికే ఓ చిత్రాన్ని ప్రారంభించారు. అది దాదాపు 80 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. మరోవైపు సుధీర్‌బాబు హీరోగా ‘సమ్మోహనం’ సినిమా రూపొందుతోంది. మంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. 
 
అలాగే సుధీర్‌బాబు హీరోగా మరో విభిన్న కథాంశంతో సిద్ధమవుతోన్న ‘వీరభోగ వసంత రాయలు’ అనే సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. 
 
ఇదిలా ఉంటే.. మాజీ బ్యాడ్మింటన్ ఛాంపియన్, ప్రస్తుత జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లోనూ సుధీర్‌బాబు నటించ‌నున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్‌లో సుధీర్‌బాబు పాల్గొంటార‌ని సమాచారం. ఓ పక్క హీరోగా బిజీగా ఉంటూనే తన ప్రొడక్షన్‌పై వరసగా సినిమాలు నిర్మించాలని సుధీర్‌బాబు ప్లాన్ చేస్తున్నారు. మరి... హీరోగా సక్సెస్ అయిన ఈ ఘట్టమనేని వారి అల్లుడు నిర్మాతగానూ విజయం సాధిస్తాడేమో చూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments