Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

దళితుడిపై ఇంత దారుణమా?.. తాళ్లకు కట్టేసి.. ఇనుప రాడ్లతోనే కొట్టి చంపేశారు..?

గుజరాత్‌లో ఓ దళితుడిని విచక్షణారహితంగా చంపేశారు. ఇనుప రాడ్లతో దళితుడిని తాళ్లతో కట్టేసి కొట్టి చంపేశారు. వివరాల్లోకి వెళితే ముఖేష్‌ వనియా అనే వ్యక్తి తన భార్యతో కలిసి రాజ్‌కోట్‌లో చెత్త ఏరుకుని జీవనం

Advertiesment
Dalit Man
, సోమవారం, 21 మే 2018 (15:15 IST)
గుజరాత్‌లో ఓ దళితుడిని విచక్షణారహితంగా చంపేశారు. ఇనుప రాడ్లతో దళితుడిని తాళ్లతో కట్టేసి కొట్టి చంపేశారు. వివరాల్లోకి వెళితే ముఖేష్‌ వనియా అనే వ్యక్తి తన భార్యతో కలిసి రాజ్‌కోట్‌లో చెత్త ఏరుకుని జీవనం సాగించేవాడు. ఆదివారం ఉదయం ఓ కర్మాగారం వైపునకు వెళ్లాడు. కానీ అతడిని అడ్డుకున్న కొందరు ఉద్యోగులు దొంగ అంటూ ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఆ దళితుడి భార్యపై కూడా కర్రలతో దాడి చేశారు. 
 
ముఖేష్‌ భార్య తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఇంకా ముఖేష్ వనియాను తాళ్లతో కట్టేసి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. వద్దని వారిస్తున్నా... వేడుకున్నా.. ముఖేష్‌ను ఇనుపరాడ్లతో కొట్టారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్ చేసి, దళితులకు గుజరాత్‌ క్షేమదాయకం కాదని దుయ్యబట్టారు.

రెండేళ్ల క్రితం జరిగిన ఉనా దాడికంటే ఇది అత్యంత దారుణ ఘటన అని, కుల ఘర్షణలతో అమాయకులు మృతి చెందుతున్నా తమ రాష్ట్ర సర్కారు ఏమాత్రం చలనం లేకుండా పడివుందని ధ్వజమెత్తారు. 
 
ఇకపోతే.. ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. ముఖేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ కోట్ సివిల్ ఆస్పత్రి వైద్యులు ముఖేష్ మృతి చెందినట్లు నిర్ధారించారని.. పోస్టు మార్టం రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నామని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం.. 2 భోగీలు దగ్ధం ( Video)