Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహా విష్ణువును.. ఇపుడు కల్కిని.. తపస్సు చేస్తున్నా... ఆఫీసుకు రాలేదు

నేను మహా విష్ణువును.. ఆయనకున్న దశావతార్లో తాను కల్కి అవతారం. ఇపుడు కల్కిగా జన్మించి, తపస్సు చేస్తున్నా.. అందువల్ల ఆఫీసుకు రాలేను అని అంటున్నారు.. ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన పేరు రమేష్ చంద్ర ఫీఫర్. ఊరు రా

Advertiesment
మహా విష్ణువును.. ఇపుడు కల్కిని.. తపస్సు చేస్తున్నా... ఆఫీసుకు రాలేదు
, శనివారం, 19 మే 2018 (13:03 IST)
నేను మహా విష్ణువును.. ఆయనకున్న దశావతార్లో తాను కల్కి అవతారం. ఇపుడు కల్కిగా జన్మించి, తపస్సు చేస్తున్నా.. అందువల్ల ఆఫీసుకు రాలేను అని అంటున్నారు.. ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన పేరు రమేష్ చంద్ర ఫీఫర్. ఊరు రాజ్‌కోట్. సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్‌లో ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. 
 
ఈయన గత 8 నెలలుగా కార్యాలయానికి వెళ్లడం లేదు. దీంతో ఆయనకు సర్దార్ సరోవర్ నిగమ్ లిమిటెడ్ నోటీసు జారీ చేసి వివరణ కోరింది. దీనికి ఆయన ఇచ్చిన సమాధానాలు చూస్తే ప్రతి ఒక్కరూ విస్తుపోవాల్సిందే. తాను విష్ణువు అవతారం. తాను ఆధ్యాత్మిక సాధన కొనసాగించేందుకు కార్యాలయ పనులు ఆటకం కలిగిస్తున్నాయని సెలవు లేఖలో పేర్కొన్నారు. పైగా, ప్రపంచ శాంతి కోసం తపస్సు చేస్తున్నట్లు చెప్పాడు. తాను కఠోరమైన దీక్ష చేయడం వల్లే దేశంలో సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయన్నారు. 
 
రమేష్‌చంద్ర ఇచ్చిన ఆన్సర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మీరు నన్ను నమ్మకపోయినా, నేనే విష్ణువు 10వ అవతారమని, రాబోయే రోజుల్లో దాన్ని రుజువు చేస్తానని ఆ ఉద్యోగి తెలిపాడు. 2010లోనే తాను కల్కి అన్న వాస్తవాన్ని గ్రహించానని, తనకు దివ్య శక్తులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
 
అందుకే భౌతిక రూపంలో కార్యాలయానికి రాలేనని తెలిపారు. అలాగే తాను రాముడు, కృష్ణుని అవతారాలు ధరించానని, నా తల్లి అహల్య అని, భార్య లక్ష్మీ అవతారమన్నారు. తాను విశ్వ కల్యాణం కోరి... వర్షం కోసం సాధనచేస్తున్ననని వివరించారు. అందుకే భౌతిక రూపంలో కార్యాలయానికి రాలేనని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటక హైడ్రామా.. రాజీనామా చేసిన యడ్యూరప్ప.. శ్రీరాములు కూడా...