Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

ఠాగూర్
సోమవారం, 20 మే 2024 (20:08 IST)
బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వ‌హించిన రేవ్ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, తానస‌లు ఆ పార్టీకే వెళ్ల‌లేదని తెలుగు సినీ న‌టుడు శ్రీకాంత్ స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంపై ఆయ‌న వివ‌ర‌ణ ఇస్తూ త‌న ఇంట్లో నుంచే ప్ర‌త్యేకంగా వీడియోను విడుద‌ల చేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ 'నేను హైద‌రాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లిన‌ట్లు పోలీసులు అరెస్టు చేసిన‌ట్లు ఫోన్ కాల్స్ వ‌చ్చాయి. వీడియో క్లిప్స్ చూశాను. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవ‌టంతో నాకు సంబంధించిన వార్త‌ల‌ను వారు రాయ‌లేదు. 
 
కొన్నింటిలో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లాన‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో స‌హా మా కుటుంబ స‌భ్యులంద‌రూ న‌వ్వుకున్నాం. మొన్న‌మో నా భార్య‌తో నాకు విడాకులు ఇప్పించేశారు. ఇప్పుడేమో రేవ్ పార్టీకెళ్లాన‌ని అన్నారు. వార్త‌లు రాసిన వాళ్లు తొంద‌ప‌డ‌టంలో త‌ప్పులేద‌నిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన‌ అత‌నెవ‌రో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. అత‌డికి కాస్త గ‌డ్డం ఉంది. ముఖం క‌వ‌ర్ చేసుకున్నాడు. నేనే షాక‌య్యాను. ద‌య‌చేసి ఎవ‌రూ న‌మ్మొద్దు. 
 
ఎందుకంటే రేవ్ పార్టీల‌కు, ప‌బ్స్ వెళ్లే వ్య‌క్తిని కాను నేను. ఎప్పుడైనా బ‌ర్త్ డే పార్టీల‌కు వెళ్లినా కొంత సేపు అక్క‌డి ఉండి వ‌చ్చేస్తానంతే. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియ‌దు. మీడియా మిత్రులు స‌హా ఎవ‌రూ న‌మ్మొద్దు. విష‌యం తెలుసుకోకుండా.. రేవ్ పార్టీలో ప‌ట్టుబ‌డ్డ శ్రీకాంత్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారు. నాలాగా ఉన్నాడ‌నే మీరు పొర‌బ‌డి ఉంటార‌ని నేను అనుకుంటున్నాను. నేను ఇంట్లోనే ఉన్నాను. ద‌య‌చేసి త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మొద్దు' అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments