Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Siddharth 40 film team

డీవీ

, శనివారం, 18 మే 2024 (18:22 IST)
Siddharth 40 film team
సక్సెస్ ఫుల్ పాన్-ఇండియన్ యాక్టర్ సిద్ధార్థ్ చిత్ర పరిశ్రమలో 21 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ప్రతి పరిశ్రమలో శాశ్వత ప్రభావాన్ని చూపారు. అతను ఎంచుకునే కథలు, పాత్రల, అసాధారణమైన పెర్ఫార్మెన్స్ తో అద్భుతంగా అలరిస్తున్నాయి. బాలీవుడ్‌లో 'రంగ్ దే బసంతి'తో చెరగని ముద్ర వేశారు. తెలుగులో 'బొమ్మరిల్లు'తో ప్రేక్షకుల మన్ననలు పొందారు.

తమిళ పరిశ్రమలో పలు జోనర్‌లలో మెరిసి.. సినిమా, నటనపై తనకున్న గొప్ప అభిరుచిని చూపించారు సిద్ధార్థ్. ఆయన లేటెస్ట్ ప్రాజెక్ట్ 'చిత' ప్రేక్షకుల హృదయాల్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇప్పుడు, సిద్ధార్థ్  'సిద్ధార్థ్ 40'( వర్కింగ్ టైటిల్) పేరుతో మరో ఎక్సయిటింగ్ మూవీ కోసం కోసం మంచి యూనిట్ తో చేతులు కలిపారు. ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌ను '8 తొట్టక్కల్'తో పేరుపొందిన శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ 'మావీరన్' నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్ లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
 
హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ “యూనివర్సల్ ఆడియన్స్ అభిరుచులను ఆస్వాదించే మంచి కంటెంట్‌ను అందించాలనే దృక్పథాన్ని కలిగి ఉన్న మన పరిశ్రమలోని యంగ్ టీంతో కలిసి పని చేస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. సినిమా ఔత్సాహికులు, ఫ్యామిలీస్ 'చిత్త'పై తమ ప్రేమను  కురిపించారు ఇది వారి భావాలను హత్తుకుని, మంచి కథలను ఎంచుకోవడానికి నాలో మరింత బాధ్యతను నింపింది. నేను చాలా స్క్రిప్ట్‌లు విన్నాను, శ్రీ గణేష్ చెప్పిన కథ నాకు ఎంతగానో నచ్చింది. ప్రేక్షకులపై ప్రభావం చూపే సినిమాలను తీయడమే నిర్మాతల ఆనందం. అలాంటి మంచి నిర్మాత అరుణ్ విశ్వతో పని చేయడం ఆనందంగా వుంది. ఆయన మంచి సినిమాతో పరిశ్రమను ఉన్నతంగా తీర్చిదిద్దాలని కలలు కనే నిర్మాత. మా అంకితభావం, పాషన్ తో ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించే అద్భుతమైన సినిమాని అందిస్తాయనే నమ్మకం నాకుంది” అన్నారు.
 
దర్శకుడు శ్రీ గణేష్ మాట్లాడుతూ, “నేను స్క్రిప్ట్ వర్క్ చేయడం ప్రారంభించినప్పుడు, యూత్ తో పాటు పరిణతి గల నటుడు కావాలని భావించాను. అప్పుడే  సిద్దార్థ్ గారిని అనుకున్నాను. కథ చెప్పడానికి ఆయన్ని కలిసినప్పుడు, తను పూర్తిగా ఎంగేజైఉన్నప్పటికీ చాలా విలువైన సూచనలను కూడా పంచుకున్నారు. ఇది చాలా ప్రశంసనీయం. మంచి పాషన్ వున్న నిర్మాత అరుణ్ విశ్వతో కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా వుంది' అన్నారు.
 
నిర్మాత అరుణ్‌విశ్వ మాట్లాడుతూ “శాంతి టాకీస్‌కి మా అమ్మ పేరు పెట్టాం. మా అమ్మ థియేటర్లలో చూసి ఆనందించ గలిగే ప్రాజెక్ట్‌లనే ఎంచుకోవాలని భావిస్తాను. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించే కమర్షియల్ చిత్రాలని రూపొందించడమే శాంతి టాకీస్ లక్ష్యం. శ్రీ గణేష్ అద్భుతమైన రచన చాలా ఆకట్టుకుంటుంది, అతను స్క్రిప్ట్ వివరించినప్పుడు, ఇది అన్ని వయసుల ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా, భాష సరిహద్దులకు అతీతంగా ఆకర్షించే చిత్రం అని నేను బలంగా నమ్మాను. సినిమాపై సిద్దార్థ్‌కు ఉన్న ప్యాషన్‌ అద్భుతం. నేను అతనితో పని చేయడానికి చాలా సంతోషిస్తున్నాను. మేము త్వరలో సర్ ప్రైజింగ్ అనౌన్స్ మెంట్స్ చేస్తాం' అన్నారు.  
 
'సిద్ధార్థ్ 40' షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సిబ్బందికి సంబంధించిన వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది