Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగిక ఆరోపణలు చేసిన నటి రేవతి... కీలక పదవికి రాజీనామా చేసిన నిర్మాత!!

ఠాగూర్
ఆదివారం, 25 ఆగస్టు 2024 (13:48 IST)
ఇటీవల జస్టిస్ హేమ కమిషన్ మలయాళ చిత్రపరిశ్రమలో సాగుతున్న క్యాస్టింగ్ కౌచ్ అంశంపై ఒక నివేదిక ఇచ్చింది. ఇందులో అనేక సంచలన విషయాలను బహిర్గతం చేసింది. ఈ నివేదిక ఇపుడు మల్లూవుడ్‌ను కుదిపేస్తుంది. ముఖ్యంగా, మలయాళ చిత్రపరిశ్రమ దర్శక - నిర్మాతలను ఉద్దేశించి పలువురు నటీమణులు ఆరోపణలు చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలోనే ఆ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత, మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిద్ధిఖీపై నటి రేవతి సంపత్ పదునైన ఆరోపణలు చేశారు. ఆయన తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. దీంతో సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేశారు.
 
'ప్లస్ 2 పూర్తి చేసిన తర్వాత నేనొక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నా. అప్పుడు నా వయసు 21 ఏళ్లు. ఒక సినిమా గురించి చర్చించాడనికి నన్ను కలవాలనుకుంటున్నట్లు సిద్ధిఖీ ఫేస్‌బుక్‌లో సందేశం పంపారు. కూతురనే అర్థం వచ్చేలా నన్ను పిలిచారు. దాంతో ఎలాంటి భయం లేకుండా ఆయన్ని సంప్రదించా. ఆ సమయంలో ఆయన నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ప్రస్తుతం మీరు చూస్తుంది ఆయన నిజస్వరూపం కాదు. 
 
ఆయనలోని మరో కోణాన్ని నేను చూశా. శారీరకంగా, మానసికంగా ఆయన నన్ను బాధించాడు. నా దృష్టిలో ఆయనొక క్రిమినల్. ఈ సంఘటన తర్వాత మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. దీనివల్ల నా కెరీర్ కూడా దెబ్బతింది. ఏ వ్యవస్థా నాకు సాయంగా నిలబడలేదు. ఈ విషయంపై మాట్లాడటానికి నాకు చాలా సమయం పట్టింది' అని శనివారం ఓ ఇంటర్వ్యూలో రేవతి సంపత్ ఆరోపణలు చేశారు. 
 
ఇది వైరల్‌గా మారిన తరుణంలో 'ఏఎంఎంఏ' జనరల్ సెక్రటరీ పదవికి సిద్ధిఖీ రాజీనామా చేశారు. మరోవైపు ప్రముఖ దర్శకుడు, కేరళ స్టేట్ చలచిత్ర అకాడమీ అధ్యక్షుడు రంజిత్ బాలకృష్ణన్‌పై బెంగాలీ నటి నటి శ్రీలేఖ శుక్రవారం కీలక ఆరోపణలు చేశారు. ఆడిషన్ కోసం పిలిచి ఆయన తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపారు. 
 
నటి వ్యాఖ్యలపై స్పందించిన రంజిత్.. ఆమెవి కేవలం ఆరోపణలు మాత్రమేనని అన్నారు. తన సినిమాలో అవకాశం ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి నిందలకు వేస్తున్నారని చెప్పారు. శ్రీలేఖ ఆరోపణలతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన తాజాగా కేరళ చలచిత్ర అకాడమీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రామ్‌గోపాల్ వర్మ సంగతి నన్ను అడిగితే ఎలా? అది హోం శాఖ పరిధిలో వుంది: పవన్ (video)

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం