Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ‌జ‌దొంగ‌గా వ‌స్తోన్న‌ స‌ప్త‌గిరి..!

అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరీర్ ప్రారంభించి... ఆ త‌ర్వాత క‌మెడియ‌న్‌గా ఎన్నో స‌క్స‌స్‌ఫుల్ చిత్రాల్లో న‌టించి మెప్పించిన యువ హాస్య‌న‌టుడు స‌ప్త‌గిరి. ఇటీవ‌ల ఈ యువ హాస్య‌న‌టుడు స‌ప్త‌గిరి హీరోగా మారి స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌, స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బి చ

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (11:43 IST)
అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరీర్ ప్రారంభించి... ఆ త‌ర్వాత క‌మెడియ‌న్‌గా ఎన్నో స‌క్స‌స్‌ఫుల్ చిత్రాల్లో న‌టించి మెప్పించిన యువ హాస్య‌న‌టుడు స‌ప్త‌గిరి. ఇటీవ‌ల ఈ యువ హాస్య‌న‌టుడు స‌ప్త‌గిరి హీరోగా మారి స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌, స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బి చిత్రాల్లో న‌టించాడు. హీరోగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన శైలిని ఏర్పరుచుకున్న ఈ టాప్ క‌మెడియ‌న్ తాజాగా గ‌జ‌దొంగ‌ పేరుతో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌నున్నారు. నంద నంద‌నా ప్రాజెక్ట్స్ ప‌తాకంపై శ‌ర్మ చుక్కా, యెడల నరేంద్ర, G .V .N .రెడ్డి  చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. 
 
గీతా ఆర్ట్స్, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ‌ల్లో ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన డి.రామ‌కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలు శ‌ర్మ చుక్కా, యెడల నరేంద్ర, G .V .N .రెడ్డి మాట్లాడుతూ... స‌ప్త‌గిరికి యాప్ట్ స‌బ్జెక్ట్ ఇది. స‌ప్త‌గిరి నుంచి ప్రేక్ష‌కులు ఆశించే అంశాల‌న్నీ ఇందులో పుష్క‌లంగా ఉంటాయి. మ‌హాన‌టుడు ఎన్టీఆర్ న‌టించిన గ‌జ‌దొంగ‌కూ, దీనికీ సంబంధం లేదు. ఇందులో స‌ప్త‌గిరిది దొంగ‌ల‌కు దొంగ‌లాంటి పాత్ర‌. అస‌లు సిస‌లు దొంగ‌ల్ని దోచుకుని స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే దొంగ‌గా క‌నిపించ‌నున్నాడు.
 
విలేజ్‌, టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో న‌డిచే యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఆగ‌స్టు తొలి వారంలో చిత్రీక‌ర‌ణ మొద‌లుపెడ‌తాం అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం: ప‌్ర‌వీణ్‌ వనమాలి, సంగీతం:బుల్గానిన్, ఆర్ట్ : వ‌ర్మ‌,మూల కథ-రచనా సహకారం: G.T.R. మహేంద్ర, P.V.సతీష్, లైన్ ప్రొడ్యూసర్:R.V.V.V.ప్రసాద్, నిర్మాత‌లు:  శ‌ర్మ చుక్కా, యెడల నరేంద్ర ,G .V .N .రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం: డి.రామ‌కృష్ణ‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments