Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు లేఖ - నీకు, నీ తండ్రికి సిద్ధూకు పట్టిన గతేపడుతుందంటూ..

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (09:20 IST)
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌కు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు లేఖ రాశారు. పంజాబ్ గాయకుడు సిద్ధూకు పట్టిన గతే నీకూ, నీ తండ్రికి పడుతుందంటూ అందులో హెచ్చరించారు. దీంతో సల్మాన్ ఖాన్‌తో పాటు.. ఆయన ఇంటి పరిసరాల వద్ద భద్రతను పెంచారు. 
 
ఇటీవల పంజాబ్ గాయకుడు సిద్ధూను కొందరు దండగులు అత్యంత క్రూరంగా కాల్చి చంపేసిన విషయం తెల్సిందే. అయితే, సిద్ధూ మూసేవాలాను చంపినట్టే సల్మాన్ ఖాన్‌ను చంపుతాంటూ ఈ బెదిరింపు లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా, సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్‌ను కూడా చంపేస్తామంటూ ఆ లేఖలో హెచ్చరించారు. 
 
దీంతో ఈ లేఖను సీరియస్‌గా తీసుకున్న సల్మాన్ ఖాన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో  వారు కేసు నమోదు చేసి గట్టి భద్రతను కల్పించారు. కాగా గతంలో సల్మాన్ ఖాన్‌పై కృష్ణ జింకలను వేటాడిన కేసు నమోదైవున్న విషయం తెల్సిందే. ఈ కేసులో సల్మాన్‌కు వ్యతిరేకంగా బిష్ణోయ్ తెగ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసులో ఆయన ముద్దాయిగా కూడా తేలారు.  
 
ఈ నేపథ్యంలో పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలను చంపిన కేసులో కీలక సూత్రధారిగా ఉన్న లారెన్స్ బిష్ణోయ్.. గతంలో సల్మాన్‌ చంపేస్తామంటూ బహిరంగంగా ప్రతిజ్ఞ చేశాడు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు లేఖ రావడంతో లారెన్స్ బిష్ణోయ్ పాత్ర ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్న నారా చంద్రబాబు నాయుడు

రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments