కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

ఠాగూర్
సోమవారం, 1 సెప్టెంబరు 2025 (11:21 IST)
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తన కొత్త చిత్రం "పెద్ది" మైసూరులో షూటింగు జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య కూడా మైసూరు పర్యటనకు విచ్చేయగా, ఆయన రామ్ చరణ్‌ను ఆహ్వానించారు. దీంతో రామ్ చరణ్... మైసూరులో సీఎం సిద్ధరామయ్యను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు కాసేపు ముచ్చటించుకున్నారు. 
 
ప్రస్తుతం రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషనులో వస్తున్న 'పెద్ది' సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ షూటింగ్ కొన్ని రోజులుగా మైసూరులో జరుగుతోంది. ఈ సమయంలో సీఎం సిద్ధరామయ్య కూడా నగరంలో ఉండటంతో, రామ్ చరణ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ భేటీలో రామ్ చరణ్ ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించగా, సిద్ధరామయ్య కూడా చెర్రీకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ సమావేశంలో ఇద్దరూ ప్రధానంగా సినిమాల గురించి చర్చించుకున్నట్లు సమాచారం.
 
‘పెద్ది' చిత్రానికి సంబంధించి మైసూరులో ప్రస్తుతం ఓ భారీ పాటను చిత్రీకరిస్తున్నారు. ఏకంగా వెయ్యి మంది డ్యాన్సర్లతో ఈ పాటను ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న విడుదల చేసేలా ప్లాన్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

సినీ నటి ప్రత్యూష కేసు .. ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments