Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న రజనీకాంత్

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (08:29 IST)
ఇటీవల అనారోగ్యానికి గురై చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఆయన్ను వైద్యులు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లమని చెప్పడంతో ఆదివారం రాత్రి ఆయన తన ఇంటికి చేరారు. 
 
కాగా, అక్టోబరు 25వ తేదీన ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఆ 27వ తేదీన తాను నటించిన కొత్త చిత్రం అన్నాత్తను తన కుటుంబ సభ్యులతో కలిసి చూశారు. ఆ మరుసటి రోజు అంటే 28న అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. 
 
ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడుకు రక్తాన్ని చేరవేసే ధమనిలో సమస్య ఉన్నట్టు గుర్తించి, మెదడులోని రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాక్స్‌ను ప్రొసీజర్ ద్వారా తొలగించారు. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. తాను డిశ్చార్జ్ అయిన విషయాన్ని అభిమానులకు ట్విట్టర్ ద్వారా తెలియజేసిన రజనీ.. 'ఇంట్లో దేవుడి ముందు ప్రార్థన చేస్తున్న ఫొటో'ను షేర్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments