Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెంగాల్‌లో భారీ వర్షాలు - 15 మంది మృత్యువాత

Advertiesment
బెంగాల్‌లో భారీ వర్షాలు - 15 మంది మృత్యువాత
, బుధవారం, 4 ఆగస్టు 2021 (12:27 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ (డీవీసీ) ఆధ్వర్యంలోని పంచెట్, మైథాన్‌ ఆనకట్టల నుంచి నీటిని విడుదల చేయడంతో ఆరు జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ఈ జిల్లాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
తూర్పు వర్ధమాన్, పశ్చిమ వర్ధమాన్, పశ్చిమ మెదినీపుర్, హూగ్లీ, హావ్‌డా, దక్షిణ 24 పరగణాలు జిల్లాల్లో చాలా ప్రాంతాలు మంగళవారం జలదిగ్బంధమయ్యాయి. కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయారని, 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. 
 
మరోవైపు, సీఎం మమతా బెనర్జీ వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం విహంగ వీక్షణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. కేంద్రం ఆధ్వర్యంలోని డీవీసీ కావాలనే ఆనకట్టల నుంచి నీటిని ఎక్కువస్థాయిలో విడుదల చేసిందని, దీనివల్లే కృత్రిమ వరద ఏర్పడిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి సౌమెన్‌ మహాపాత్ర ఆరోపించారు.
 
ఇదిలావుంటే, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌-చంబల్‌ ప్రాంతంలో మంగళవారం కుంభవృష్టి కురిసింది. దీంతో 1,171 గ్రామాలు ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా శివ్‌పురి, షియోపుర్‌ జిల్లాల్లో మునుపెన్నడూ లేని రీతిలో 800 మి.మీ. వర్షపాతం నమోదైంది. 200 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. దటియా నుంచి రత్నగఢ్‌ ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12 ఏళ్ల బాలికపై అఘాయిత్యం.. ఆపై చెట్టుకు ఉరేశారు..