ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్, ప్రముఖ సినీ నటుడు శ్రీ పృథ్వీరాజ్, ప్రముఖ సినీ నృత్య దర్శకుడు శ్రీ షేక్ జానీ మాస్టర్ లు బుధవారం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ పృథ్వీరాజ్, శ్రీ జానీ మాస్టర్ లకు పార్టీ కండువాలు మెడలో వేసి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
pawan kalyan, Johnny Master
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, పార్టీ విధానాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఇరువురికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ఎన్నికల ప్రచారంలో చురుగ్గా ముందుకు వెళ్లాలని, పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీ పృథ్వీరాజ్ గారు తన కుటుంబ సభ్యులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు.