Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్ : నాగిరెడ్డి పాత్రలో ప్రకాశ్ రాజ్

స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. అనేక టాలీవుడ్ ప్రముఖులు వివిధ పాత్రల్లో కనిపించనున్నారు.

Webdunia
గురువారం, 12 జులై 2018 (10:58 IST)
స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. అనేక టాలీవుడ్ ప్రముఖులు వివిధ పాత్రల్లో కనిపించనున్నారు.
 
తాజాగా, విజయ వాహిని స్టూడియోస్ అధినేతగా, దర్శక నిర్మాతగా నాగిరెడ్డి పాత్రలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నటించనున్నారు. బహుముఖ ప్రజ్ఞాపాటవాలు కలిగిన వ్యక్తిగా పేరొందిన నాగిరెడ్డి... తన చిత్రాల కథల ఎంపిక, చిత్రీకరణ విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. ప్రతి సినిమాను ఆయన ఒక తపస్సులా భావించి పూర్తిచేసేవారు. అందువల్లనే విరామమెరుగని విజయాలు ఆయన ఖాతాలో కనిపిస్తాయి.
 
ఎన్టీఆర్ కెరియర్‌లోనే చెప్పుకోదగిన సినిమాలు కొన్ని ఈ బ్యానర్ నుంచి వచ్చాయి. ఎన్టీఆర్ అంటే నాగిరెడ్డికి ఎంత అభిమానమో.. ఆయనంటే ఎన్టీఆర్‌కి అంతటి గౌరవం. ఇద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేది. అందువల్లనే ఎన్టీఆర్ బయోపిక్‌లో నాగిరెడ్డి పాత్రకు చోటుకల్పించారు. ఈ పాత్ర కోసం ప్రకాశ్ రాజ్‌ను ఎంపిక చేశారు. కాగా, ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments