Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్ మెట్రో జర్నీ... ద్రాక్షారామం రైతుతో జనసేనాని ముచ్చట్లు (video)

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (11:56 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం హైదరాబాద్‌ మెట్రో రైలులో ప్రయాణించారు. తాను నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్ షూటింగ్ నిమిత్తం ఆయన ఈ మెట్రో జర్నీ చేశారు. మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన ద్రాక్షారామం రైతుతో ముచ్చటించారు. 
 
పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రం 'వకీల్ సాబ్' షూటింగ్ నిమిత్తం మియాపూర్ వెళ్లారు. సాధారణ ప్రయాణికుడిలా మెట్రో స్టేషనులో చెకింగ్ ప్రక్రియను, ఎంట్రీ విధానాన్ని పాటించారు. ఈ మెట్రో ప్రయాణంలో భాగంగా అమీర్ పేట స్టేషన్లో ట్రైన్ మారారు. ఈ సందర్భంలో తోటి ప్రయాణికులతో సంభాషించారు. 
 
మియాపూర్ వెళ్లే ట్రైన్‌లో పవన్ కళ్యాణ్ పక్కన ద్రాక్షారామం, సత్యవాడ ప్రాంతాల వారు కూర్చున్నారు. ద్రాక్షారామం చెందిన చిన సత్యనారాయణ అనే రైతుతో మాట్లాడారు. పంటల గురించి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
 
పవన్ అడిగిన ప్రశ్నకు చిన సత్యనారాయణ సమాధానమిస్తూ, ఇటీవలి వర్షాలకు వ్యవసాయం బాగా దెబ్బతింది అని చెప్పారు. తమ ప్రాంతంలోనూ, కుటుంబంలోనూ చాలామంది మీ అభిమానులు ఉన్నారు.. ఈ ప్రయాణంలో మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది అని ఆనందం వ్యక్తం చేశారు. 
 
మెట్రో ట్రైన్ ప్రయాణం తనకు మొదటిసారి అని ఆ రైతు చెప్పగానే పవన్ కళ్యాణ్ నవ్వుతూ మీకే కాదు నాకు కూడా మెట్రో ప్రయాణం ఇదే మొదటిసారి అని అన్నారు. ఈ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ వెంట చిత్ర నిర్మాత దిల్ రాజు, ఇతర సిబ్బంది ఉన్నారు. 
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments