Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ9 రిపోర్టర్‌గా నటుడు నిఖిల్ కొత్త అవ‌తారం..!

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (16:44 IST)
ఒక సినిమాకి డేట్స్ ఇవ్వ‌టం.. షూటింగ్ చేసి, డ‌బ్బింగ్ చెప్పెసాక‌.. ఒక‌టో రెండో ఇంట‌ర్యూలు.. ప్రీ-రిలీజ్ ఫంక్ష‌న్ చేసేస్తే ప‌న‌యిపోతుంది అనుకుంటున్న చాలామంది హీరోలు నిఖిల్‌ని చూసి మారాలి. ఈరోజుల్లో సినిమా తీయ‌టం కంటే రిలీజ్ చేయ‌టం చాలా క‌ష్టం.. అంత‌కంటే ప్రేక్ష‌కుడికి సినిమాని రీచ్ చేయ‌టం అనేది చాలా పెద్ద స‌మ‌స్యగా మారింది. 
 
గ‌తంలో ఓక చిత్రం విడుద‌ల‌య్యాక మౌత్ టాక్‌తో రెండ‌వ వారం, మూడ‌వ వారంలో స్ట‌డిగా వెళ్ళి 50 రోజులు.. 100 రోజులు ఆడేవి.. కాని సినిమా కాల‌మానం చాలా చిన్న‌ద‌య్యింది. తెలుగు సినిమా భ‌విష్య‌త్తు ఒక వీకెండ్ మాత్ర‌మే అంటే కేవ‌లం మూడు రోజులన్న‌మాట‌.. ఈ మూడు రోజులు ఎంత పిండుకునేవాడికి అంత.. 
 
ప్రేక్ష‌కుడికి ఒక‌ప్పుడు సినిమానే ఎంట‌ర్‌టైన్‌మెంట్. ఇప్ప‌ుడు సినిమా కూడా ఓక ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో ఆప్ష‌న్‌గా మారింది. ఇలాంటి టైంలో మొద‌టి రోజు మొద‌టి ఆట ఫుల్ చేసుకోక‌పోతే ఆ వీకెండ్ అంతా పోయిన‌ట్టే.. ఇదిలా వుంటే సినిమా చేసేసాము ప్ర‌మోష‌న్... నిర్మాత భాద్య‌త నాకెందుకు అనుకుంటున్నారు చాలామంది హీరోలు. వీరంద‌రికి పూర్తి భిన్నంగా నిఖిల్ ఆలోచిస్తాడు.. తను చేసే చిత్రాల వ‌ల్ల అటు నిర్మాత‌లు, ఇటు డిస్ట్రిబ్యూట‌ర్స్ ఎగ్జిబ్యూట‌ర్స్ ఎవ‌రూ న‌ష్ట‌పోకూడదు అనే మైండ్ సెట్‌తో ప‌నిచేస్తాడు. గ‌తంలో ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడా, కేశవ‌, కిరాక్ పార్టి లాంటి చిత్రాల‌కి త‌న స్టైల్‌లో ప్ర‌మోష‌న్ చేశాడు.. 
 
ఇప్ప‌ుడు తాజాగా త‌ను న‌టించిన అర్జున్ సుర‌వ‌రం చిత్రం మే 1న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో ఇన్వెస్టిగేష‌న్ జ‌ర్న‌లిస్టుగా నిఖిల్ న‌టిస్తున్నారు. అయితే కొత్త‌గా టివి 9 రిపోర్ట‌ర్‌గా మారి త‌న సినిమాని ప్ర‌మోట్ చేస్తున్నాడు. అంతేకాదు త్వ‌ర‌లో రీసెంట్ ఎల‌క్ష‌న్స్‌లో అంద‌ర్ని యూట్యూబ్‌లో ఎంట‌ర్‌టైన్ చేసిన ఓక లీడ‌ర్‌ని ఇంట‌ర్వ్యూ చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇలా త‌ను త‌న సినిమాకి రిలేటెడ్‌గా ప్ర‌మోట్ చేసి అంద‌రితో శ‌భాష్ అనిపించుకుంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments