Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవ్ పార్టీలో లేకపోవడం మీడియాకు కంటెంట్ లేదు.. రేయి పగలు జరిగే ప్రశ్న : నటుడు నవదీప్

ఠాగూర్
ఆదివారం, 26 మే 2024 (13:34 IST)
రేవ్ పార్టీ అంటే రేయి పగలు జరిగే పార్టీ అని నటుడు నవదీప్ అన్నారు. బెంగుళూరు రేవ్ పార్టీలో తాను లేకపోవడం మీడియాకు సరైన కంటెంట్ చిక్కలేదని నటుడు నవదీప్ అన్నారు. ఇటీవల బెంగుళూరు నగరంలో రేవ్ పార్టీ వెలుగులోకి వచ్చిన విషయం తెల్సిందే. ఇది హాట్ టాపిక్‌గా మారింది. అయితే, బెంగళూరు రేవ్ పార్టీకి తాను వెళ్లినట్టు రూమర్స్ రాకపోవడంతో చాలామంది నిరుత్సాహపడి ఉంటారని భావిస్తున్నట్టు నటుడు నవదీప్ అన్నారు. 
 
'ఏంటన్నా. ఈసారి నువ్వు ఫేక్ న్యూస్‌లో కనిపించడంలేదు' అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు అడిగారని తెలిపారు. తన కొత్త సినిమా 'లవ్ మౌళి' ప్రచారంలో భాగంగా పాల్గొన్న ప్రెస్‌మీట్ రేవ్ పార్టీ గురించి ప్రశ్న ఎదురవగా ఆయన స్పందించారు. 'చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇలా ఏదైనా అంశం సంచలనంగా మారితే.. మీపై ఆరోపణలు వచ్చేవి. ఈసారి రాలేదు' అంటూ విలేకరి ప్రస్తావించగా.. మంచే జరిగిందని, ఈ ఒక్కసారి వదిలేశారని నవ్వుతూ సమాధానాలిచ్చారు. రేవ్ పార్టీ అంటే.. రేయి, పగలు జరిగేదని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. ఆ పార్టీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందన్నారు.
 
చిత్ర పరిశ్రమలో వచ్చిన మార్పు గురించి మాట్లాడుతూ.. 'కోవిడ్ టైమ్లో ప్రేక్షకులకు 'ఓటీటీ' బాగా దగ్గరైంది. ఇంట్లో కూర్చొనే అన్ని భాషల చిత్రాలను చూస్తున్నారు. విజువల్ ఫీస్ట్ అనిపించే అగ్ర హీరోల సినిమాలు చూసేందుకు తప్ప థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదు. థియేటర్లలో విడుదలైన రెండు, మూడు వారాలకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయని ఆడియన్స్ భావిస్తున్నారు. మా చిత్రం విషయానికొస్తే.. దాని నిర్మాణం ఎలా జరిగిందన్న దానిపై ఓ సినిమా తీయొచ్చు. చిత్రీకరణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం' అని తెలిపారు. రొమాంటిక్ డ్రామాగా అవనీంద్ర తెరకెక్కించిన 'లవ్ మౌళి'లో భావన సాగి హీరోయిన్. ఈ మూవీ జూన్ 7న విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijayashanti: పుష్ప-2 తొక్కిసలాట.. రాజకీయం చేయొద్దు.. విజయశాంతి

వరిపంట వేస్తే ఉరితో సమానమంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు : మంత్రి సీతక్క

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం : ఆంధ్రా - ఒరిస్సాలకు వర్ష హెచ్చరిక

నివాస భవనంలోకి దూసుకెళ్లిన విమానం.. పది మంది మృతి... ఎక్కడ?

తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments