Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

ఠాగూర్
శనివారం, 24 మే 2025 (13:10 IST)
"కృష్ణ" అనే తెలుగు చిత్రంలో విలన్ పాత్రను పోషించిన బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ మృతి చెందారు. ఈ బాలీవుడ్ నటుడు వయసు 54 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు వెల్లడించారు.
 
కాగా, సింహాద్రి, సీతయ్య, అతడు వంటి పలు చిత్రాల్లో నటించిన ముకుల్ దేవ్... సీరియల్ నటుడుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. పలు హిందీ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. 
 
"దస్తక్‌"తో నటుడుగా వెండితెరకు పరిచయమైన ఆయన బాలీవుడ్‌లోనేకాకుండా, తెలుగు, పంజాబీ, కన్నడ చిత్రాల్లో నటించారు. రవితేజ హీరోగా నటించిన "కృష్ణ" చిత్రంలో విలన్‌గా నటించి ప్రేక్షకులను ఆలరించారు. ఆ సినిమా తర్వాత కేడీ, అదుర్స్, సిద్దం, మనీ మనీ మోర్ మనీ, నిప్పు, భాయ్ వంటి తెలుగు చిత్రాల్లో నటించారు. 2022లో విడుదలైన అంత్ ది ఎండ్ తర్వాత ఆయన నటించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments