Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో కాదు.. బౌన్సర్... ఇద్దరు సోదరులకు కంచెలా....

సినీ హీరో, టీడీపీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ తాజాగా నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పూర్తిచేశారు. ఈ అంత్యక్రియలకు నందమూరి అభిమానుల

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (09:18 IST)
సినీ హీరో, టీడీపీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ తాజాగా నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పూర్తిచేశారు. ఈ అంత్యక్రియలకు నందమూరి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు సైతం సాధ్యపడలేదు.
 
కానీ, ఓ హీరో బౌన్సర్‌గా మారి వారిని కట్టడి చేశారు. అంతేనా తండ్రిని కోల్పోయి దుఃఖంలో మునిగిపోయివున్న ఇద్దరు సోదరులకు ఇనుప కంచెలా ఉండి అంత్యక్రియల తతంతం సజావుగా పూర్తయ్యేలా చూశాడు. ఆ హీరో ఎవరో మంచు మనోజ్. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌లకు మంచి మిత్రుడు. 
 
తండ్రి మరణంతో ఆయన కుమారులైన కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అలాంటి పరిస్థితుల్లో అంత్యక్రియల సందర్భంగా తారక్, కల్యాణ్‌రామ్‌లను చూసేందుకు జనం ఎగబడ్డారు. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, హీరోలు అంతా అలా చూస్తూ మిన్నకుండిపోయారు. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. 
 
దీంతో ఈ ఇద్దరు అన్నదమ్ముల కోసం మంచు మనోజ్ ఒక బౌన్సర్‌లా నిలబడ్డాడు. జనాన్ని కంట్రోల్ చేసుకుంటూ కార్యక్రమం పూర్తయ్యే వరకూ ధైర్యంగా నిలబడ్డాడు. దీనికి సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనోజ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పిక్స్ చూసిన ప్రతి ఒక్కరూ మనోజ్‌ను అభినందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments