Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకంత సీన్ లేదు... అసత్యాలు ప్రచారం చేయొద్దు ప్లీజ్.. నటుడు కృష్ణుడు

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (18:35 IST)
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువతి తనపై 139 మంది అత్యాచారం చేశారనీ, వారిలో బడా రాజకీయ నేతలతో పాటు సినీ సెలెబ్రిటీలు కూడా ఉన్నారంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా, ఆ యువతి అనేక సినీ ప్రముఖుల పేర్లను వెల్లడించింది. ఇలాంటి వారిలో బుల్లితెర యాంకర్ ప్రదీప్‌ పేరు తొలుత బయటకు వచ్చింది. ఇపుడు మరో నటుడు కృష్ణుడు పేరు వచ్చింది. 
 
దీనిపై నటుడు కృష్ణుడు స్పందించాడు. ఇది పూర్తిగా నిరాధారమైన కేసుగా తాను భావిస్తానని చెప్పాడు. హైదరాబాద్ నగరంలో పటిష్టమైన పోలీస్ వ్యవస్థతో పాటు నిరంతరం అందుబాటులో ఉండే షిటీమ్స్ వ్యవస్థ అందుబాటులో ఉందనీ, చదువుకున్న యువతి తనకు అన్యాయం జరుగుతుంటే అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు కృష్ణడు ప్రశ్నించాడు. 
 
నిజంగా తనకు అన్యాయం జరిగి ఉంటే డయల్ 100కు ఫోన్ చేసుంటే పోలీసులు తక్షణమే స్పందించి ఉండేవాళ్లు. మమ్మలి కలవడానికి చాలా మంది వస్తుంటారు. సెలబ్రటీలను కేసులో ఇన్వాల్‌ చేయడంతో కేసు తీవ్రత పెరుగుతుందంటే తప్పు. ఈ కేసులో నిజానిజాలను పోలీసులు వెలికితీస్తారు అని కృష్ణుడు చెప్పారు.
 
ముఖ్యంగా, ఇలాంటి ఆరోపణలతో మేము, మా కుటుంబసభ్యులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొచ్చాడు. నాలుగైదు నెలల క్రితం నల్గొండ జిల్లా నుంచి ఓ మహిళ నాకు ఫోన్ చేసింది. నీను మీ అభిమానిని, నల్గొండకు రావాలని ఫోన్‌లో చేప్పింది. అయితే నాకు అనుమానం వచ్చి కాల్‌కట్ చేసి నెంబర్‌ను బ్లాక్ చేశాను. ఈ కేసులో పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు కానీ, ఫోన్‌ కానీ నాకు రాలేదు. నేను ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తాను అంటూ కృష్ణుడు చెప్పుకొచ్చాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments