Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డకు జన్మనివ్వనున్న హీరోయిన్ ఇలియానా

Webdunia
ఆదివారం, 11 జూన్ 2023 (14:24 IST)
ఒకపుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఇలియానా ఇపుడు ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. గర్భం దాల్చిన దగ్గర్నుంచి, ఓ బిడ్డకు జన్మనిచ్చేంత వరకూ ఉండే దశ... ఓ అపురూపమైన ప్రయాణం. అదెలా ఉంటుందో మాటల్లో చెప్పలేనని ఇలియానా అంటోంది. ఇప్పుడు తను కూడా ఓ బిడ్డకు తల్లికాబోతోంది. ఈ విషయాన్ని ఇటీవలే సోషల్ మీడియా ద్వారా తెలియపరిచింది. 
 
ఇప్పుడు బేబీ బంప్‌తో ఉన్న ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి... "తల్లికావడం ఓ అద్భుతమైన అనుభూతి, మాటల్లో వర్ణించలేనిది. ఈ క్షణాల్ని ఆస్వాదిస్తున్నా. నాలో ఓ జీవి ప్రాణం పోసుకొంటుందన్న ఊహే అపురూపంగా అనిపిస్తోంది. నా బిడ్డ బయటకు వచ్చాక తనని ఎంత ప్రేమిస్తానో, ఎలా
చూసుకొంటానో నాకు తెలీదు. కానీ ఇప్పటికైతే అమితంగా ఇష్టపడుతున్నా" అంటూ ఓ ఉద్వేగభరితమైన పోస్ట్ పెట్టింది. 
 
"ఈమధ్య కొన్ని కష్టమైన రోజులు గడిచాయి. ఆ పరిస్థితులు నన్ను గందరగోళానికి గురిచేశాయి. అయితే వాటి నుంచి నేను క్రమంగా బయటపడ్డా. ఆ క్షణంలో తను నా చెంత ఉన్నాడు, నా కన్నీళ్లు తుడిచాడు, నా జీవితంలో చిరునవ్వులు పూయించాడు" అంటూ తన ప్రియుడి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments