Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ (video)

సెల్వి
శనివారం, 14 డిశెంబరు 2024 (09:30 IST)
Allu Arjun
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ హైదరాబాద్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం హైకోర్టు మధ్యంత బెయిల్ కాపీని జైలు సూపరింటెండ్‌కు అందజేయడంతో ఆ వెంటనే విడుదల ప్రక్రియను ప్రారంభించారు. అల్లు అర్జున్‌ న్యాయవాదులు రూ.50వేల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించారు. ఆ వెంటనే జైలు నుంచి విడుదల చేయగా.. అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలు వెనుక గేటు నుంచి పోలీసులు పంపించారు. 
 
మరోవైపు అల్లు అర్జున్ లాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన కాపీలను జైలు అధికారులకు ముందే అందజేశామని.. కానీ ఎందుకు విడుదల చేయలేదో తెలియడం లేదన్నారు.
 
శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో అరెస్ట్ చేయగా.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. 
 
హైకోర్టు ఉత్వర్వులు అప్‌లోడ్‌ చేసేసరికి రాత్రి 10.30 గంటలు దాటిపోవడంతో ఆయనను శనివారం ఉదయం విడుదల చేస్తామని జైలు అధికారులు తెలిపారు. దీంతో రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments