రాత్రంగా జైలులో వున్న అల్లుఅర్జున్ ఈరోజు ఉదయం 6.40 నిముషాలకు జైలునుంచి ఇంటికి బయలుదేరి వచ్చారు. జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి రాగానే కుటుంబసభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. ముందుగా గుమ్మడికాయతో దిష్టి తీశారు. కొడుకు అయాన్ ను చూడగానే గుండెకు హత్తుకుని అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. అల్లు కుటుంబసభ్యులు అంతా అక్కడే వున్నారు. ఇక బయట మీడియాతో మాట్లాడారు.
సంథ్య థియేటర్ లో ఘటన దురద్రుష్టకరం. రేవతి కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటాను. నేను చట్టాన్ని గౌరవిస్తాను. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 20 ఏళ్ళుగా థియేటర్లో సినిమా చూస్తున్నాను. కానీ దురద్రుష్ట వశాత్తూ ఈసారి ఇలా జరిగింది. నాపై కేసు చట్టపరిధిలో వున్నందున దానిపై ఏమీ మాట్లాడలేను. ఈ సందర్భంగా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.