Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్షన్ థ్రిల్లర్ గా S-99- మోషన్ టైటిల్ విడుదల చేసిన రమేశ్ ప్రసాద్

Webdunia
మంగళవారం, 27 జూన్ 2023 (15:17 IST)
Ramesh Prasad, Jaganmohan, Shweta Verma, Yatish
జగన్మోహన్, శ్వేతా వర్మ హీరో, హీరోయిన్:గా నటిస్తున్న చిత్రం 'S99. దర్శకులు సి .జగన్మోహన్ (మాయాబజార్ జగన్మోహన్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. యాక్షన్ అండ్ త్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని  యతీష్ అండ్ నందిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర మోషన్ టైటిల్ ను రమేశ్  ప్రసాద్ గారు  ఆవిష్కరించి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
 
అనంతరం రమేష్ ప్రసాద్ గారు  మాట్లాడుతూ... మా నాన్నగారు సినిమాని చాలా ఇష్టపడేవారు, సినిమాల కోసం మా నాన్నగారు చాలా కష్టపడ్డారు, అదే నన్ను ఉత్సాహపరిచింది.  సినిమా కోసం పని చేయాలి అనుకున్న. అందుకోసమే నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివినా,  ప్రపంచవ్యాప్తంగా ప్రసాద్ ల్యాబ్స్ ను నిర్మించాను. సినిమా అంటే ఒక అద్భుతం కానీ ఇప్పుడు సినిమాలు థియేటర్లో సరిగ్గా ఆడటం లేదు.. కానీ సినిమాల కోసం చాలామంది కష్టపడి పని చేస్తున్నారు. S99 టైటిల్ చాలా కొత్తగా అనిపిస్తుంది. అలాగే  S99 సినిమాని నిర్మించిన జగన్ గారికి ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం పని చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అన్నారు.
 
 ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు టైటిల్ పోస్టర్ విడుదల చేసిన రమేశ్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ S99 సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా మీ ముందుకు రాబోతుందని మీరందరూ కూడా ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అంటూ దర్శకుడు జగన్మోహన్ గారు తెలిపారు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని ప్రకటించారు. ఇలాంటి మరిన్ని చిత్రాలని తీయడానికి సిద్ధంగా ఉన్నామని నిర్మాత యతీష్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ.. పార్లమెంట్ సమావేశాల మధ్య...?

'ఆర్ఆర్ఆర్‌'పై థర్డ్ డిగ్రీ ప్రయోగం... కటకటాల వెనక్కి సీఐడీ మాజీ ఏఎస్పీ

ఆటో నడుస్తుండగానే రిపీర్ చేశాడు.. వీడియో వైరల్ (video)

జగన్ - అదానీల విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలి : వైఎస్ షర్మిల

బోరుగడ్డ అనిల్‌ రాచమర్యాదలకు రూ.5 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments