Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్‌మీడియా ఫాలోవర్స్‌తో పబ్లిసిటీ హీరోలకు లాభమా? నష్టమా? ` స్పెషల్‌ స్టోరీ

Webdunia
మంగళవారం, 27 జూన్ 2023 (14:08 IST)
KS Ramaro
సినిమాకు ప్రమోషన్‌ ముఖ్యం. ఒకప్పటి నుంచి ఇప్పటితో పోలిస్తే నక్కకు నాగలోకానికి వున్న తేడా కనిపిస్తుంది. అప్పట్లో గోడలకు వాల్‌ పోస్టర్లు అంటించి, రిక్షాలలో నేడే చూడండి అంటూ ప్రచారాలు చేసేవారు. ఓ దశలో పాపం పసివాడు సినిమాకు హెలికాప్టర్‌లో పాంప్లెట్స్‌ విసరడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇలా కాలంతోపాటు ప్రచార మార్గాలు కొత్తగా వచ్చి పడుతున్నాయి. ఆ తర్వాత బస్టాప్‌లు, రైల్వేస్టేషన్లు ఇలా రకరకాలుగా వున్న ఈ ప్రమోషన్‌ను ఏకంగా విమానాల దాకా విజయ్‌దేవరకొండ లైగర్‌ వెళ్ళిపోయింది. ఇదంతా కాలంతోపాటు వస్తున్న మార్పులే. ఇదంతా బిఫోర్‌ కరోనా అనుకోవాలి. కానీ ఆఫ్టర్‌ కరోనా తర్వాత ప్రచారం మరింతగా ఎదిగింది.
 
sudhakr with falowers
ఇప్పుడు అంతా సోషల్‌ మీడియా హవానే నడుస్తోంది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా అది వైరల్‌ అయ్యేలా అందరూ సోషల్‌ మీడియాను బేస్‌ చేసుకుని ఛానల్స్‌, ప్రింట్‌ మీడియా కూడా ప్రచారం చేసేస్తున్నారు. అందులో నిజానిజాలు ఎంతమేరకు వున్నాయనేది గ్రహించకుండా చేస్తున్న ఇలాంటి ప్రచారాలు చాలామంది సెలబ్రిటీల వ్యక్తిగత కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇదంతా ఒక భాగమైతే, సినిమా ప్రమోషన్‌ మరో భాగం. దీనికి ప్రస్తుతం వున్న ప్రచార మార్కెట్‌ డిజిటల్‌, సోషల్‌ మీడియా.
 
దీని గురించి ఇటీవలే ఓ సాథియా ప్రిరిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథి మెగాస్టార్‌ చిరంజీవితో అభిలాష వంటి సినిమాలు తీసిన కె.ఎస్‌. రామారావు స్పందించిన తీరు వాస్తవాలను కళ్ళకుకట్టినట్లుంది. ఇప్పుడు ప్రచారం అంతా సోషల్‌ మీడియావైపు చూస్తోంది. ఏది జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఒకప్పుడు డైలీ పేపర్లు, మేగజైన్లు వుండేవి. ఇప్పుడు మేగజైన్‌ లేనేలేవు. డైలీపేపర్లు కేవలం రాజకీయ విషయాలు చూసేందుకు ఉపయోగపడుతున్నాయి తప్పితే సినిమాలకు పెద్దగా ఉపయోగంలేదని అర్థమైంది. అందుకే సోషల్‌ మీడియావైపు సినిమాల ప్రచారం చేయాల్సివస్తుందని అన్నారు. ఈ సినిమా ప్రమోషన్‌కు సోషల్‌ మీడియాకు చెందిన ఫాలోవర్స్ చాలామంది హాజరయి కేరింతలు కొట్టారు.
 
Dulkar dance with falowers
ఆమధ్య మలయాళనటుడు దుల్కన్‌ సల్మాన్‌ సినిమా ప్రమోషన్‌లో కూడా స్టార్‌ హోటల్‌లో పెడితే అక్కడ అసలు మీడియా పెద్దగాలేదు. కేవలం ఇన్‌స్ట్రా, ట్విట్టర్, యూట్యూబ్‌ ఫాలోవర్స్‌ను ఆహ్వానించారు. వారంతా సినిమా గురించి విలేకరుల అవతారం ఎత్తారు. యాంకర్‌ కూడా ఈ సినిమా గురించి మీడియా క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్‌ లో పాల్గొంటుందని ఆ సోషల్‌ మీడియా తరపునవారికి మైక్‌ అందజేశారు. 
 
ఇక వారు అడిగే ప్రశ్నలు వింటే అక్కడి జర్నలిస్టులు ముక్కుమీద వేలేసుకునేలా చేసింది. ఎక్కువమంది యూత్‌ మహిళలే ప్రశ్నలు సంధిస్తున్నారు. అందులో ఎక్కువగా.. దుల్కన్‌ నేను మీ ఫ్యాన్‌ను. ఒకసారి మిమ్మల్ని హగ్‌ చేసుకోవాలనుంది అని అంటే, మరొకరు మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలనుందని అడిగారు. ఆ తర్వాత మీకు పెండ్లికాకపోతే నేను మిమ్మల్ని పెండ్లిచేసుకోవాలనుండేదని సిగ్గుపడుతూ చెప్పుకొచ్చింది. ఇంకొకరు డుల్కన్ తో డాన్స్ చేయాలను ఉంది అని అడగగానే ఆయన ఓకే అన్నాడు. 

ఇలాంటి ప్రశ్నలు ఒక సినిమా ప్రమోషన్‌కేకాదు యువ హీరోలు నటించే ప్రతి సినిమాలకు ఎక్కువగామారింది. 
 
ఇక మరో హీరో సందీప్‌ కిషన్‌ తన సినిమా ప్రమోషన్‌ను కూడా జూబ్లీహిల్స్‌లోని ఓ కాఫీషాప్‌లో ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన నిక్కర్‌తో వచ్చాడు. అక్కడ వచ్చినవారంతా ఇన్‌స్ట్రా ఫాలోవర్సే. వారు తన స్నేహితులనుకూడా తీసుకువచ్చారు. వారి డ్రెస్‌ చూస్తే ఆశ్చర్యపోకమానదు. ఓ అమ్మాయి అయితే.. హీరోతో.. మిమ్మల్ని హగ్‌ చేసుకుని వీడియోకాల్‌ మా ఫ్రెండ్స్‌కూ చూపించాలనుందని ఇంగ్లీషులో మాట్లాడింది. దానికి ఓకే అన్నాడు హీరో. ఇంకొకరైతే మీరు ఈ సినిమాకు సిక్స్‌ప్యాక్‌ బాడీ చేశారు. ఒకసారి మీ  బాడీ చూడాలనుంది అని అడిగారు. నేను షర్డ్‌ తీస్తే బాగోదు. ఇప్పటికే నిక్కర్‌తో వున్నా. అన్నా వినలేదు. చివరికి ఒకపక్కన గుండీలు తీసి చూపించివరకు వదల్లేదు. మరో ఫాలోవర్ అయితే, అన్నా ఒకప్పుడు తొక్కావు  సైకిల్.  ఇప్పుడు చేసావు మైకేల్ .. అంటూ తన శైలిలో అరిచాడు. 
 
ఇక్కడకు వచ్చేవారంతా తెలుగు సరిగ్గా పలకడంరాని ఇప్పటి జనరేషన్‌. ఆ సినిమా ప్రమోషన్‌కు కొల్‌కత్తా, బెంగుళూరు, ముంబై, అస్సాంలో పుట్టి పెరిగినవారు ఇక్కడ సాప్ట్‌వేర్‌ జాబ్‌లు, చదవుకోవడానికి వచ్చినవారు కావడం విశేషం.
 
ఇక ఈ ఫాలోవర్స్ ను మించిన ఫాలోవర్స్ సినిమా విడుదల రోజు ఐ మాక్స్ దగ్గర ఉంటారు.  ఇక వారు మాట్లాడే భాష తెలుగులో కొత్తగా క్రియేట్ చేస్తారు. అయితే,  ఇదంతా సినిమాకు ప్రమోషన్‌గా ఉపయోగపడుతుందని చిత్ర యూనిట్‌ చెప్పడం విశేషం.
 
అదేవిధంగా నిఖిల్‌ తాజా సినిమా స్పై. ట్రైలర్‌ రిలీజ్‌లో పాల్గొన్నవారంతా సోషల్‌మీడియా ఫాలోవర్స్‌. వారంతా నిఖిల్‌ నడుస్తుంటే ఈలలు, కేకలు, కేరింతలే.. ఆయన మాట్లాడానుకుంటే రచ్చరచ్చ చేసేశారు. ఒకరకంగా అభిమానులను మించిపోయారు. వారిని కంట్రోల్‌ చేయడానికి ఆఫ్టర్‌ ప్రెస్‌మీట్‌ మీతో ఫొటో దిగుతానని హామీ ఇవ్వగానే అందరూ శాంతించారు. ఆ తర్వాత ఆయనతో ఫొటోలు దిగడానికి నిఖిల్‌కు చాలా ఓపిక తెచ్చుకోవాల్సివచ్చింది.
 
ఇక తాజాగా నిన్న రాత్రి హీరో సుధాకర్‌ కొమాకుల నటించిన నారాయణ అండ్‌కో సినిమా ప్రీ రిలీజ్‌ జరిగింది. పెద్ద హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు సోషల్‌ మీడియా ప్రమోటర్స్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అసలు మీడియాకు కుర్చీలేలేవు. ఇదంతా విడ్డూరంగా వున్నా నమ్మాల్సిన నిజం. ఇక వారిని ఎంటర్‌టైన్‌ చేయడానికి హీరో బజర్‌దస్త్‌టీమ్‌తో యాంకర్‌ కమ్‌ స్కిట్‌లు చేసి అలరించేలా చేశారు. ఫైనల్‌గా వారితో డాన్స్‌ చేస్తూ అలరించారు. ఈ హీరోకు పెద్దగా సక్సెస్‌ లేవు. కానీ వచ్చిన ఫాలోవర్స్‌ జేజేలు పలికేస్తున్నారు. ఇప్పటి ట్రెండ్‌ హీరో కాబట్టి సోషల్‌ మీడియాపై పట్టువున్నవాడు కాబట్టి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
 
ఇలాంటి ప్రచారాలు అగ్రహీరోలుకూడా చేస్తున్నారు. కానీ వీరిలా ఇంతలా లోగ్రేడ్‌ ప్రచారాలు చేయడంలేదని తెలుస్తోంది. దీనిపై పలువురు చిత్ర నిర్మాతలు, దర్శకులు స్పందిస్తూ. కాలంతోపాటు సినిమాలు మారాయి, ప్రచారం మారింది. కానీ ఇంతలా మారుతుందని అనుకోలేదని అంటున్నారు. ముందుముందు ప్రచారం ఇంటిలోపలికి వస్తుందేమోనని సీనియర్‌ నిర్మాత వ్యాఖ్యానించడం కొసమెరుపు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుప్రీంకోర్టు జడ్జీలకు చేదు అనుభవం... విమానంలో మందుబాబుల వీరంగం

'పప్పుగాడు' అనే మాట అనలేదు.. జగన్ అంటే అభిమానం: రామ్ గోపాల్ వర్మ (video)

చెన్నైకు 480 కిమీ దూరంలో తీవ్ర వాయుగుండం.. ఏపీకి భారీ వర్షాలు

అయ్యప్పమాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ (Video)

లోక్‌సభ సభ్యురాలిగా ప్రియాంకా గాంధీ ప్రమాణ స్వీకారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments