Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని కెరీర్‌లో హయ్యెస్ట్ రికార్డ్ వ్యూస్ సాధించిన అంటే..సుందరానికీ టీజర్

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (16:42 IST)
Nani- Nazria
నేచురల్ స్టార్ నాని ''అంటే.. సుందరానికీ'' టీజర్ నవ్వులు పూయించింది. నాని నుంచి వినోదాత్మక చిత్రాలు ఆశించే ప్రేక్షకులు సుందరం పాత్ర కావలసినంత వినోదం పంచుతుందనే భరోసా ఈ టీజర్ ఇచ్చింది. వివేక్ ఆత్రేయ తనదైన శైలిలో తెరకెక్కించిన ఈ సినిమా టీజర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకులు నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.
 
'అంటే.. సుందరానికీ’ టీజర్ రికార్డ్ వ్యూస్ సాధించింది. కేవలం 24 గంటల్లో  టీజర్ వీడియోకు 11 మిలియన్ల వ్యూస్ దక్కాయి. నాని కెరీర్ ఇదే హయ్యెస్ట్ వన్ డే రికార్డ్. యూట్యూబ్‌లో ఇప్పటికీ టాప్ ట్రెండింగ్‌లో ఉన్న  టీజర్ కి 366K+ లైక్స్ సొంతం చేసుకుంది. టాప్ పాన్ ఇండియా సినిమాల టీజర్‌ సమానంగా 'అంటే సుందరానికీ' టీజర్ వ్యూస్, లైక్స్ దక్కించుకోవడం విశేషం. టీజర్ కి వచ్చిన వ్యూస్ లైక్స్ చూస్తుంటే సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్ధమౌతుంది.
 
దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రంలో నానిని క్రిస్టియన్ అమ్మాయి నజ్రియా ప్రేమలో పడ్డ బ్రాహ్మణ కుర్రాడిలా విభిన్న పాత్రలో ప్రజంట్ చేశారు. టీజర్ లో లవ్ ట్రాక్ చాలా కొత్తగా ఫ్రెష్ అండ్ ప్లజంట్ గా అనిపించింది. టీజర్ ని చాల ఇంట్రస్టింగ్ గా ప్రజంట్ చేశారు. టీజర్ మొత్తం నవ్వులు పూయిస్తూనే టైటిల్ లో వున్న ''అంటే...''కి సమాధానం ప్రేక్షకుడి గెస్సింగ్ కి వదిలి ఆసక్తిని పెంచగా, కథలో మరో కీలకమైన అంశం వుందని హింట్ ఇచ్చేలా టీజర్ డిజైన్ చేయడం ఆకట్టుకుంది.  
 
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా, నికేష్ బొమ్మి సినిమాటోగ్రఫర్ గా, రవితేజ గిరిజాల ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి 'అడాడే సుందరా' అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి 'ఆహా సుందరా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.  జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments