Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్య ప్రాధాన్యాన్ని తెలియజేసే అభిలాష

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (15:52 IST)
Amardeep, Ashwini Reddy, prudhivi and others
మనిషి చైతన్యానికే కాదు సమాజ చైతన్యానికి, అభివృద్ధికి విద్య ఎంతగానో దోహదం చేస్తుంది. అలాంటి విద్య ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ,  "అభిలాష".సినిమాను తెరకెక్కించారు. అమర్ దీప్ హీరోగా, అశ్విని రెడ్డి హీరోయిన్ గా  నటించిన ఈ సినిమాకు శివప్రసాద్ చలువాది దర్శకుడు. శ్రీ హరిహర ధీర మూవీమేకర్స్ పతాకంపై సి.హెచ్. శిరీష నిర్మించిన  ఈ సినిమా ట్రైలర్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమంలో విడుదలైంది. ట్రైలర్ ను ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ హాస్య నటుడు పృథ్వి విడుదల చేశారు. సీడీని చిత్ర బృందంతో కలసి పృథ్వి ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా పృథ్వి మాట్లాడుతూ, "చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు లేవు. ఏది ఆడితే అదే పెద్ద సినిమా. ట్రైలర్ చాలా బావుంది. ఓ మంచి పాయింట్ తో ఈ సినిమాను తీయడం సంతోషం. చిత్ర బృదం కష్టానికి తగిన మంచి ఫలితం వస్తుందని, రావాలని కోరుకుంటున్నాను. "ఆర్ ఆర్ ఆర్" సినిమాకు ఆస్కార్ రావడంతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రస్ఫుటమైంది" అని అన్నారు.
 
చిత్ర దర్శకుడు శివప్రసాద్ చలువాది  మాట్లాడుతూ, "వల్గారిటీకి తావులేకుండా నవరసాల్లోని అన్ని అంశాలను మేళవించి ఈ సినిమాను తీశాం. విద్యకు ఉన్న ప్రాధాన్యాన్ని సందేశాత్మకంగా ఇందులో చూపించాం. 1983లో వచ్చిన చిరంజీవి గారి అభిలాష చిత్రానికి, ఈ సినిమాకు కదా పరంగా ఎలాంటి సంబంధం లేదు. ఆ చిత్రంలో ఉరి రద్దు  చేయాలని చూపిస్తే, ఇందులో చదువు వద్దన్న విలన్ ను ఎలా ఎదుర్కోవడం జరిగిందన్న అంశాన్ని చూపించాం" అని చెప్పారు.
 
చిత్ర నిర్మాత సి.హెచ్. శిరీష మాట్లాడుతూ, పాత్రలకు సరిపోయే మంచి ఆర్టిస్టులను ఎంపికచేసుకుని మరీ ఈ చిత్రాన్ని తీశామని పేర్కొనగాల సీనియర్ నటులు అశోక్ కుమార్, సమ్మెట గాంధీ మాట్లాడుతూ, ఇటీవల వచ్చిన బలగం సినిమా కోవలో ఈ చిత్రం కూడా విజయవంతం అవుతుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓ వైపు బాలయ్య.. మరోవైపు భువనేశ్వరి.. ఇద్దరి మధ్య నలిగిపోతున్నా... సీఎం చంద్రబాబు

రాందేవ్ బాబుకు అరెస్ట్ వారెంట్ జారీ... ఎందుకో తెలుసా?

కాలువలోకి దూసుకెళ్లిన జీపు... 9 మంది మృత్యువాత (Video)

మార్కాపురం రైల్వే స్టేషన్‍‌లో నరకయాతన అనుభవించిన ప్రయాణికులు...

యువతిని నగ్నంగా వీడియో తీసిన వ్యక్తి అంతలోనే శవమయ్యాడు... ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments