Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్లాక్ అండ్ వైట్ న‌టుడు సార‌ధి క‌న్నుమూత‌

Advertiesment
Sarathi
, సోమవారం, 1 ఆగస్టు 2022 (10:49 IST)
Sarathi
బ్లాక్ అండ్ వైట్ సినిమాల‌నుంచి క‌ల‌ర్ సినిమాల‌వ‌ర‌కు ప‌లు చిత్రాల్లో న‌టించిన సార‌థి (క‌డ‌లి విజ‌య సార‌ధి) సోమ‌వారంనాడు క‌న్నుమూశారు. ఆయ‌న‌కు 80 సంవ‌త్స‌రాలు. గ‌త కొంత‌కాలంగా కిడ్నీస‌మ‌స్య‌, న‌రాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. హైద‌రాబాద్‌లోని న్యూర్ సెంట‌ర్‌లో ఆయన చికిత్స‌చేసుకుంటూ మృతిచెందారు. 
 
1942 ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పెనుగొండ‌లో జ‌న్మించారు. ఆయ‌న స్టేజీ న‌టుడు. దాదాపు 372 చిత్రాల్లో న‌టించారు. చెన్నైనుంచి సినిమారంగం హైద‌రాబాద్ త‌ర‌లివ‌చ్చే క్ర‌మంలో ఆయ‌నొక క్రియా శీల‌క బాధ్య‌త నిర్వ‌హించారు. ఆయ‌న న‌టుడు ప్ర‌భాక‌ర్‌రెడ్డి అనుంగు శిష్యుడు. ప్ర‌స్తుతం చిత్ర‌పురి కాల‌నీ ఏర్పాటుకు చెందిన ఆంధ్ర‌ప‌దేశ్ సినీ కార్మిక‌శాఖ‌కు కోశాధికారిగా వున్నారు. అప్ప‌ట్లో ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. 
 
webdunia
Sarthi latest
ఎన్‌.టి.ఆర్‌. ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సీతారామ‌క‌ళ్యాణ్యంలో న‌ల‌కూబ‌రుడు అనే పాత్ర‌ను పోషించారు.  ప‌ర‌మానంద‌య్య శిష్యుల నుంచి అమ‌ర‌దీపం వ‌ర‌కు ఎన్నో పాత్ర‌లు చేశాడు. ఫిలింన‌గ‌ర్‌లోని హౌసింగ్ సొసైటీలో ప‌లు బాధ్య‌త‌లు నిర్వ‌హించారు కూడా. 

నాటకరంగానికి సేవచేశారు. ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాలలో నటించారు.
 
నందమూరి తారకరామారావు దర్శకత్వంలో వెలువడిన సీతారామ కళ్యాణం సినిమాలో నలకూబరునిగా తొలిసారి చలనచిత్రంలో నటించారు
వీరు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
 
సీతారామ కళ్యాణం (1961) - నలకూబరుడు
పరమానందయ్య శిష్యుల కథ (1966) - శిష్యుడు
ఈ కాలపు పిల్లలు (1976)
భక్త కన్నప్ప (1976)
అత్తవారిల్లు (1977)
అమరదీపం (1977)
ఇంద్రధనుస్సు (1978)
చిరంజీవి రాంబాబు
జగన్మోహిని (1978)
మన ఊరి పాండవులు (1978)
సొమ్మొకడిది సోకొకడిది (1978)
కోతల రాయుడు (1979)
గంధర్వ కన్య (1979)
దశ తిరిగింది (1979)
అమ్మాయికి మొగుడు మామకు యముడు (1980)
నాయకుడు – వినాయకుడు (1980)
మదన మంజరి (1980)
మామా అల్లుళ్ళ సవాల్ (1980)
బాబులుగాడి దెబ్బ (1984)
మెరుపు దాడి (1984) - అంజి
ఆస్తులు అంతస్తులు 
శారద
అమరదీపం
ముత్యాల ముగ్గు
కృష్ణవేణి
శాంతి
చిత్రాల తో పాటు ఇంకా మరెన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు
అంతే కాదు సారధి గారు విజయవంతమైన చిత్రాల నిర్మాత కూడా! ధర్మాత్ముడు,అగ్గిరాజు,శ్రీరామచంద్రుడు చిత్రాలను నిర్మించారు. నవతా కృష్ణంరాజు గారు నిర్మించిన జమిందార్ గారి అమ్మాయి, పంతులమ్మ,అమెరికా అమ్మాయి, ఇంటింటి రామాయణం, ఓఇంటి భాగోతం చిత్రాల మ్యూజిక్ సిట్టింగ్స్ అన్ని సారధి గారే చూసారు.రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి తో ఉన్న సాన్నిహిత్యం తో గోపికృష్ణ బ్యానర్ లో నిర్మించిన చిత్రాలకు  సారధి గారు సాంకేతికంగా చూసుకునేవారు. చిత్రపురి కాలనీ నిర్మాణంలో సారధి గారు కీలక పాత్ర పోషించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధన.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తన విడాకులపై వచ్చేవన్నీ తాత్కాలికమైన పుకార్లే : నాగ చైతన్య