Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలాగే ఆడియెన్స్ కు ఇంప్రెస్ కలిగించే ఆరంభం సాంగ్ : శ్రీ విష్ణు

డీవీ
శనివారం, 2 మార్చి 2024 (17:28 IST)
Aarambham team with srivishnu
మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఆరంభం". ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆరంభం సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ 'అనగా అనగా.'  హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
 
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ - "ఆరంభం" సినిమా టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ఇప్పుడే చూశాను. టీజర్, సాంగ్ చాలా బాగుంది. ఫ్రెష్ గా అనిపించాయి. ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. చూడగానే నేను ఇంప్రెస్ అయినట్లే థియేటర్ కి వచ్చే ఆడియెన్స్ కు కూడా "ఆరంభం" సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను. డైరెక్టర్, ప్రొడ్యూసర్..మిగతా వాళ్లు అంతా యంగ్ టీమ్ ఈ సినిమాకు పనిచేశారు. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
 
అనగా అనగా పాటకు స్వరూప్ గోలి లిరిక్స్ అందించగా..ఎస్ పి చరణ్ పాడారు. సింజిత్ ఎర్రమిల్లి క్యాచీ ట్యూన్ తో పాటను కంపోజ్ చేశారు. వాలే పొద్దుల్లో పాడిందే పాట, చుట్టేస్తుంటారే ఈ ఊరంతా..హద్దే లేకుండా ఆడిందే ఆట, లేదే బేజారంట.. సాగే మేఘాలే దారే మారాయే, చూసొద్దామా ఈ సరదాలంటూ, వీచే గాలుల్నే అటుగా తిప్పాయే, రారా ఓ సారంటూ..మది పాడే ఈ సంగీతం దరి రాదే ఏ సంకోచం, మరి మీదే ఈ సల్లాపం, అంటూ సాగిందే మీ పయనం. అనగా అనగా అనగా పదాలే..కలిపావంటే ఒకటై పోవా..అంటూ ఒక ఊరి నేపథ్యంగా ఆహ్లాకరంగా సాగుతుందీ పాట. త్వరలో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూపీలో ఇద్దరు యువతుల వివాహం.. ప్రేమ.. పెళ్లి ఎలా?

శ్రీతేజ్: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడు?

పుష్ప 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్న

Mariyamma Murder Case: నందిగాం సురేష్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీం

ఢిల్లీలోని భవనంపై టెర్రస్ నుంచి నవజాత శిశువు మృతదేహం.. ఎలా వచ్చింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments