Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను 16 ఏళ్ల అమ్మాయిని... ఆ మాటలన్నందుకు క్షమించండి... దంగల్ గర్ల్ జైరా... ఎందుకలా?

దంగల్ చిత్రంలో నటించిన 16 ఏళ్ల బాలిక వసీం జైరా తన సినిమా ఇచ్చిన కిక్కుతో చేసిన వ్యాఖ్యలు ఆమెకు ఇబ్బందులను తెచ్చిపెట్టింది. దంగల్ సూపర్ సక్సెస్ నేపధ్యంలో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుత

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (21:00 IST)
దంగల్ చిత్రంలో నటించిన 16 ఏళ్ల బాలిక వసీం జైరా తన సినిమా ఇచ్చిన కిక్కుతో చేసిన వ్యాఖ్యలు ఆమెకు ఇబ్బందులను తెచ్చిపెట్టింది. దంగల్ సూపర్ సక్సెస్ నేపధ్యంలో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సినిమాలో తన పాత్రను కాశ్మీర్ అమ్మాయిలు స్ఫూర్తిగా తీసుకోవాలని వ్యాఖ్యలు చేశారు. దీనితో కాశ్మీర్ వేర్పాటువాదులు మండిపడ్డారు. 
 
వేర్పాటువాదుల హెచ్చరికలతో వెంటనే తను చేసిన వ్యాఖ్యలను వాపసు తీసుకోవడంతోపాటు క్షమాపణలు చెపుతున్నట్లు బహిరంగ లేఖను విడుదల చేసింది జైరా. తన ప్రవర్తన ఎవరినైనా నొప్పించి వుంటే క్షమించాలని వేడుకుంది. అంతేకాకుండా... కాశ్మీరీ యువతకు రోల్ మోడల్‌గా చిత్రంలో నన్ను చూపించారనీ, ఐతే ఆ పాత్రలో తను వున్నట్లుగా ఎవరూ స్ఫూర్తిగా తీసుకోవద్దని తెలిపింది. 
 
తనను ఓ రోల్ మోడల్‌గా కూడా పెట్టుకోవద్దనీ, తను 16 ఏళ్ల అమ్మాయిననీ, తన వయసును దృష్టిలో పెట్టుకుని తను చేసిన వ్యాఖ్యలను చూడాలంటూ జైరా వేడుకుంది. జైరాను ఇలా బలవంతంగా క్షమాపణలు చెప్పించడంపై పలువురు సెలబ్రిటీలు మండిపడుతున్నారు. అనుపమ్ ఖేర్ అయితే తన రోల్ మోడల్ జైరా అంటూ ట్వీట్ చేశారు. దంగల్’ సినిమాలో రెజ్లర్ గీత పొగట్ చిన్నప్పటి పాత్రలో నటించి మెప్పించిన జైరా సొంత రాష్ట్రం జమ్మూకశ్మీర్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు.. మే 15 నుండి మే 26 వరకు 12 రోజుల పాటు...

తూచ్.. అదంతా ఫేక్ : రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన అయోధ్య రామిరెడ్డి (Video)

సూర్యాపేటలో పరువు హత్య.. కులాంతర వివాహం చేసుకున్నాడని కొట్టి చంపారు..

పరాయి మహిళ మోజులోనే గురుమూర్తి ఘాతుకం!

Amazon: అమేజాన్ విధానాలపై పవన్ అసంతృప్తి.. గిఫ్ట్ కార్డుల నుండి డబ్బు.. ఇంత కష్టమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments