Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుర శ్రీధర్ తదుపరి చిత్రం- 'ఎ ఫర్‌ అమెరికా'

దర్శకుడిగా, నిర్మాతగా విభిన్న చిత్రాల్ని రూపొందించిన మధుర శ్రీధర్‌రెడ్డి, ప్రస్తుతం 'ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్‌ ఆఫ్‌ లేడీస్‌ టైలర్‌' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే. 30 ఏళ్ళ క్రితం రాజేంద్రప్రసాద్‌ హీరోగా సంచలన విజయాన్ని అందుకున్న 'లేడీస్‌ టైలర్‌'

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (20:00 IST)
దర్శకుడిగా, నిర్మాతగా విభిన్న చిత్రాల్ని రూపొందించిన మధుర శ్రీధర్‌రెడ్డి, ప్రస్తుతం 'ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్‌ ఆఫ్‌ లేడీస్‌ టైలర్‌' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే. 30 ఏళ్ళ క్రితం రాజేంద్రప్రసాద్‌ హీరోగా సంచలన విజయాన్ని అందుకున్న 'లేడీస్‌ టైలర్‌' సినిమాకి ఇది సీక్వెల్‌. వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
 
ఇదిలా ఉండగా, మధుర శ్రీధర్‌ మరో చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 'ఎ ఫర్‌ అమెరికా' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సుజయ్ - సుశీల్‌ అనే దర్శక ద్వయం దర్శకత్వం వహించనుండడం గమనార్హం. సుజయ్- సుశీల్‌ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందనీ, ఇదొక కాంటెంపరరీ అర్బన్‌ కామెడీ జోనర్‌లో ఉంటుందనీ, కథ వినగానే ఈ సినిమాని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చానని మధుర శ్రీధర్‌రెడ్డి చెప్పారు. 
 
మరో ఔత్సాహిక నిర్మాత అప్పిరెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని ఆయన నిర్మిస్తున్నారు. 'ఎ ఫర్‌ అమెరికా' సినిమా కోసం కొత్త నటీనటుల్ని తీసుకోవాలనుకుంటున్నారు. ఇందు కోసం ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నారు. ఔత్సాహికులెవరైనా తమ ప్రొఫైల్స్‌ని పంపించవచ్చని మధుర శ్రీధర్‌రెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి సునీల్‌ కాశ్యప్‌ సంగీతం అందిస్తున్నారు. ఔత్సాహికులు తమ ప్రొఫైల్స్‌ని ఈ-మెయిల్‌ ద్వారా పంపించవచ్చు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సింహాచలం ఘటన : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు - సీఎం చంద్రబాబు

చిన్న అజాగ్రత్త ఆమె ఉసురు తీసింది.. పెళ్లయిన 9 నెలలకే చున్నీ చంపేసింది!

అమేజాన్ నుండి రూ. 1.4 కోట్ల వార్షిక ప్యాకేజీ- గీతం ప్రియాంకా అదుర్స్

Akshaya Tritiya: విక్షిత్ భారత్ సంకల్పానికి కొత్త బలాన్ని ఇస్తుంది: భారత ప్రధాన మంత్రి

మరో 36 గంటల్లో భారత్ మాపై దాడి చేయొచ్చు.. పాక్ మంత్రి : వణికిపోతున్న పాకిస్థాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments