Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఇద్దరు మాజీ భార్యలతో నేను మాట్లాడతాను: అమీర్ ఖాన్

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (16:33 IST)
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నిజ జీవితంలో రెండు సార్లు విడాకులు తీసుకున్నాడు. ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం సింగిల్‌గా ఉంటున్నాడు. ఇప్పటివరకు విడాకులపై నోరువిప్పని అమీర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఇద్దరు మాజీ భార్యల గురించి చెప్పుకొచ్చాడు.
 
ప్రపంచం దృష్టిలో తాము విడాకులు తీసుకున్నామని అమీర్ ఖాన్ తెలిపాడు. అది ప్రజలు వేరేలా అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ భార్యాభర్తలైనా విడాకుల తరువాత ఒకరి గురించి ఒకరు పట్టించుకోరు. కానీ, తాము అలా కాదు. 
 
తాము వివాహ వ్యవస్థకు గౌరవం ఇస్తాము. అందుకే విడాకుల ముందే అన్ని చర్చించుకొని విడిపోయాం.. స్నేహితుల్లా ఉండాలనుకున్నాం.. అలాగే ఉంటున్నాం.. ఇప్పటికీ మా ఇద్దరు మాజీ భార్యలతో తాను మాట్లాడతాను. 
 
వారితో తనకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉండటం తన అదృష్టం. పిల్లల బాధ్యతలోనూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటాం" అని చెప్పుకొచ్చాడు. 
 
కాగా అమీర్ .. 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. కొన్ని విభేదాల కారణంగా 2002 లో రీనాకు విడాకులిచ్చాడు అమీర్.. ఆ తరువాత 2005లో అమీర్‌ ఖాన్‌ కిరణ్‌ రావును పెళ్లాడారు. 15ఏళ్ల వైవాహిక​ బంధం అనంతరం ఈ జంట విడిపోయిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

9 మంది దొంగలు, ఒక్కడే కమాండర్: టీవీకె విజయ్

TVK Vijay Maanaadu: మధురై మానాడుకి వెళ్తూ మూత్ర విసర్జన చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

India: అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు- చైనాను అధిగమించిన భారతదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments