టాక్‌తో నిమిత్తం లేకుండా కలెక్షన్లలో దుమ్మరేపుతున్న 'రాధేశ్యామ్'

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (15:53 IST)
ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం "రాధేశ్యామ్". రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ నెల 11వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. తొలి రోజున ఏకంగా రూ.79 కోట్ల హైయ్యర్ గ్రాస్‌ను వసూలు చేసిన "రాధేశ్యామ్" రెండో రోజుకు ఇది రూ.119 కోట్లకు చేరుకుంది. మూడు రోజుల్లో రూ.151 కోట్లను క్రాస్ చేసింది. 
 
నిజానికి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, టాక్‌తో నిమిత్తం లేకుండా కలెక్షన్లు మాత్రం దుమ్మురేపుతోంది. ప్రేమకీ విధికి మధ్య సంఘర్షణ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రచార చిత్రాలు మరిన్ని అంచాలన్ని పెంచాయి. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించగా, కృష్ణంరాజు ఓ కీలక పాత్రను పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం గత మూడు రోజుల్లో భారీ కలెక్షన్లను రాబట్టింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశ వ్యాప్తంగా, వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్మురేపుతుంది. 
 
కాగా, ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా నటించారు. రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. రాజమౌళి ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చగా, తమన్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం మత్తులో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త... పుర్రెను చీల్చుకుని నోట్లో నుంచి...

భారతీయ విద్యార్థులకు శుభవార్తం - హెచ్-1బీ వీసా ఫీజు చెల్లించక్కర్లేదు...

రౌడీ షీటర్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments