Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగే దొంగ దొంగ అని అరిచిన‌ట్లుంది.. జోడి చిత్ర వివాదంపై వివరణ..!

Webdunia
శనివారం, 4 మే 2019 (20:44 IST)
ఆది, శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న సినిమా జోడి. ఈ చిత్రానికి విశ్వ‌నాథ్ అరిగెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాపై వివాదం వ‌చ్చింది. ఈ చిత్రం విష‌యంలో త‌లెత్తిన వివాదంపై నిర్మాత‌ గుర్రం విజ‌య‌ల‌క్ష్మి వివ‌ర‌ణ ఇస్తూ... ద‌ర్శ‌కుడు విశ్వ‌నాథ్ ఉప్ప‌ల‌పాటి అనురాధ‌ను ప‌రిచ‌యం చేసాడు. నిర్మాత‌గా నాకు మంచి సినిమా నిర్మించాల‌నే కోరిక ఉన్నా నేను ఎక్కువుగా అమెరికాలో ఉండ‌టం జ‌రుగుతుంది. 
 
ఇక్క‌డ నిర్మాణ వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు నాకు వెసులుబాటుగా ఉంటుంద‌ని ఉప్ప‌ల‌పాటి అనురాధా గారి భాగ‌స్వామ్యంలో సినిమా నిర్మాణానికి నేను అంగీక‌రించాను. 
 
 
అనురాధా కుమారుడు చ‌ర‌ణ్ తేజ్ నాకు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా హిందీ డ‌బ్బింగ్ రైట్స్ అమ్మ‌డం జ‌రిగింది. ఈ విష‌యంలో నేను చాలా షాక్‌కి గురయ్యాను. నిర్మాణంలో మేజర్ షేర్ కలిగిన నా అనుమతి లేకుండా మోసం చేసి హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్మారు. ఇప్పుడు సినిమా నిర్మాత‌లం మేమే అంటూ వారిచ్చిన కంప్లైట్ నిజంగా చాలా దారుణం. 
 
మోసం చేసిన వారే మోసపోయాం అంటూ ముస‌లి క‌న్నీళ్ళు కార్చుతున్నారు. దొంగే .. దొంగ దొంగ అని అరిచ‌న‌ట్లు వీరి వ్య‌వ‌హారం ఉంది. ఈ సినిమా విష‌యంలో అన్ని రుజువులు మా వ‌ద్ద ఉన్నాయి. మాకు తెలియ‌కుండా సినిమా హక్కుల‌ను అమ్మ‌డ‌మే కాకుండా సినిమా వారిదే అంటూ వారిచ్చిన ఫిర్యాదుపై  మేము న్యాయ‌పోరాటానికి దిగ‌బోతున్నాం అన్నారు. 
 
ద‌ర్శ‌కుడు విశ్వ‌నాథ్ మాట్లాడుతూ.. గుర్రం విజ‌య‌ల‌క్ష్మి గారికి ఉప్ప‌ల‌పాటి అనురాధా గారిని నేను ప‌రిచ‌యం చేసాను. సినిమా ద‌ర్శ‌కుడిగా సినిమా నిర్మాత‌కు న‌ష్టం వాటిల్లుతుంటే నేను చూస్తూ ఊరుకోను. సినిమా కంప్లీట్ కాకుండానే హిందీ డ‌బ్బింగ్ రైట్స్‌ని వాళ్ళు ఎవ‌రికీ తెలియ‌కుండా అమ్మేసారు. ఇంత మోసం చేస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. విజ‌య‌ల‌క్ష్మి గారు విలువ‌ల‌తో బ్ర‌తికే మ‌నిషి. సినిమా ప‌ట్ల ఉన్న ప్యాష‌న్‌తో ఈ రంగం వైపు అడుగు పెట్టారు. ఆమె ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చాల‌ని చూస్తే వారు కోర్టులో స‌మాధానం చెప్ప‌కోవాల్సి వ‌స్తుంది. సినిమా పూర్తి అయి, ప్ర‌మోష‌న్స్ ప్లాన్లో ఉండ‌గా ఈ వార్త మ‌మ్మ‌ల్నిక‌ల‌చివేసింది. త‌ప్ప‌కుండా న్యాయం పోరాటం చేసి సినిమాని విడుద‌ల చేస్తాం అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మైన‌ర్ బాలిక‌పై లైంగిక దాడి- గర్భం దాల్చింది.. ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు

పిన్నాపురంలో పవన్ పర్యటన.. హెలికాప్టర్‌ ద్వారా సోలార్ పవర్ ప్రాజెక్ట్ పరిశీలన (video)

ఘనంగా ఘట్కేసర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 6 వార్షికోత్సవం: ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments