Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైతన్య, కృతి శెట్టి పై టైమ్‌లెస్ లవ్ సాంగ్

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (18:44 IST)
Naga Chaitanya and Kriti Shetty
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘కస్టడీ’ మే 12న థియేటర్లలో ప్రేక్షకులకు థ్రిల్ అందించడానికి సిద్ధంగా వుంది. ఈ సినిమా టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ రాగా, పోలీసుల గొప్పతనాన్ని తెలిపే ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అయింది.
 
ఈరోజు ఈ సినిమా సెకండ్ సింగిల్‌కి సంబంధించిన అప్‌డేట్‌ని అందించారు మేకర్స్. టైమ్‌లెస్ లవ్ అనే పాటను ఈ నెల 23న విడుదల చేయనున్నారు. మాస్ట్రో ఇళయరాజా, అతని కుమారుడు యువన్ శంకర్ రాజా టైమ్‌లెస్ ట్రాక్‌ని స్కోర్ చేసారు. పోస్టర్ సూచించినట్లుగా, ఇది రెట్రో-స్టయిల్ నంబర్.
 
పోస్టర్ నాగచైతన్య, కృతిశెట్టి  క్లాసిక్ డ్యాన్సింగ్ ఫోజ్ లో రెట్రో దుస్తులలో కనిపించారు. చై టోపీ ఉన్న సూట్‌ను ధరించగా, కృతి శెట్టి స్లీవ్‌లెస్ గౌను స్పోర్టింగ్ బన్ హెయిర్‌డోలో ఆకట్టుకుంది.
 
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు.
 
ఈ చిత్రానికి ఎస్‌ఆర్‌ కతీర్‌ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి రాజీవ్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌, డివై సత్యనారాయణ ఆర్ట్‌ డైరెక్టర్‌.
 
తారాగణం: నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమి అమరేన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్  తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments