కింగ్ నాగార్జున-నాగ చైతన్య నటించిన సూపర్‌హిట్ చిత్రం బంగార్రాజులో దక్షా నాగర్కర్ ముఖ్యమైన పాత్రలో కనిపించారు. తన క్యూట్ లుక్, పెర్ఫార్మెన్స్‌తో సినీ ప్రియుల మనసు గెలుచుకుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం కోసం ఆమె ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ దక్షనాగార్కర్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. నాగ చైతన్యపై దక్షనాగార్కర్ తన తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
"నాగ చైతన్యతో బంగార్రాజు సినిమాలో నటించాను. మా ఇద్దరి మధ్య ముద్దు సన్నివేశం ఉంది. నాగ చైతన్య మహిళలకు ఎంత గౌరవం ఇస్తాడో చూశాను. కిస్సింగ్ సీన్ తర్వాత చైతూ నాకు సారీ చెప్పాడు.
నిజానికి అది ఒక సీన్ మాత్రమే. అతను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. అతను నిజమైన పెద్దమనిషి అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు..." అంటూ చెప్పుకొచ్చాడు.