Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌తి అబ్బాయి చూడాల్సిన సినిమాః అక్కినేని అఖిల్‌

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (18:08 IST)
Bhaskar-Akil
అక్కినేని అఖిల్‌, పూజా హెగ్డే న‌టించిన సినిమా `మోస్ట్ ఎలిజిబుల్ బేచ్‌ల‌ర్‌`. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌కుడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీవాసు నిర్మించారు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 15న విడుద‌కాబోతుంది. ఈ చిత్రంలో న‌టించిన న‌టీన‌టుల గురించి ద‌ర్శ‌కుడు, అఖిల్ ఈ విధంగా తెలియ‌జేస్తున్నారు.
 
అఖిల్ః అమిత్‌ను ఇందులో తీసుకున్నాం. ఆయ‌న్ను చూడ‌గానే `విక్ర‌మార్కుడు`లో పాత్ర గుర్తుకు వ‌స్తుంది. కానీ త‌ను చాలా స‌ర‌దాగా వుంటాడు. త‌న‌తో న‌టించ‌డానికి కాస్త టైం ప‌ట్టింది.
భాస్క‌ర్ః బ‌న్నీవాసు ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాలు అన్నీ తెలిసిన వ్య‌క్తి. ఒక్కోసారి అదే నాకు ఇబ్బంది కూడా. త‌ను ఫ్రెండ్ అయినా అన్నింటిలో ఇన్‌వాల్వ్ అవ‌డంతో కొంచెం ఇబ్బందిగా అనిపించేది. సినిమా అంటే క‌సితో ప‌నిచేస్తాడు. అల్లు అర‌వింద్‌కు ఆయ‌న పెద్ద ఎసెట్‌.
 
అఖిల్ః  న‌తిసా హానియా గాయ‌ని. `ఏ జింద‌గీ` సాంగ్ పాడింది. ఈ పాట భాస్క‌ర్ నాకు వినిపించాడు. పాట విన‌గానే ఈ వాయిస్ వుండాల్సిందే అన్నా. త‌ర్వాత తెలిసింది. త‌ను చాలా చిన్న పిల్ల‌. 
భాస్క‌ర్ః మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కు మెసేజ్ పెట్టాను. ఈ గాయ‌ని గురించి చెప్ప‌మ‌ని. కానీ త‌ను స‌మాధానం ఇవ్వ‌లేదు. డైరెక్ట్‌గా పాట రికార్డింగ్ జ‌రిగేట‌ప్పుడు చూపించాడు. త‌ను చిన్న పిల్ల‌. ఆమె ఎదిగితే ఈ సినిమాలో సెటిల్ అయ్యేది. ఈ పాట‌ను లాంగ్ జ‌ర్నీలో వెళ్ళినప్పుడు హాయిగా అనిపిస్తుంది.
 
భాస్క‌ర్ః నా కేస్టింగ్‌ డిపార్ట్‌మెంట్ వారు ఆమ‌నిగారిని తీసుకుంటే బాగుంటుంద‌ని చెప్పారు. ఆమె సిసింద్రీ త‌ర్వాత మ‌ళ్ళీ ఇప్పుడు అఖిల్‌తో చేస్తుంది అన్నారు. చాలా బాగుంటుంద‌ని వెంట‌నే ఆమెకు చెప్ప‌డం ఆమె అంగీక‌రించ‌డం జ‌రిగింది.
అఖిల్ః ఆమ‌నిగారితో సిసింద్రీ చేశాను. కానీ అప్ప‌టికి ఆమె గురించి ఏమీ తెలీదు. చిన్న వ‌య‌స్సు. ఆ త‌ర్వాత చేస్తున్న సినిమా ఇది. ఆమె న‌న్ను కొడుకులా ఆప్యాయత‌ను చూపుతారు.
 
ఇక ముర‌ళీ శ‌ర్మ‌కు తెలుగు చ‌ద‌వ‌డం, రాయ‌డం కాదు. త‌ను ముంబై నుంచి వ‌చ్చినా తెలుగును తెలుసుకుని బాగా మాట్లాడేవారు. ఆయ‌న న‌టిస్తుంటే ఎదుటివారికి పోటీ వుండేద‌ని భాస్క‌ర్‌, అఖిల్ తెలిపారు. వెన్నెల కిశోర్ గురించి చెబుతూ, చిన్న సీన్ అయినా దాన్ని త‌ను ఓన్ చేసుకుని మెరుగులు దిద్దుకునేవారని తెలిపారు. 
ఇక పూజా హెగ్డే గురించి చెబుతూ, త‌ను ఆరు భాష‌ల్లో బిజీగా వుంది. రాత్రి వేరే చోట షూట్ చేసి విమానంలో వ‌చ్చి తెల్లారి ఇక్క‌డ న‌టిస్తూ ఏ మాత్రం అల‌స‌ట లేకుండా న‌టించేదని తెలిపారు. ఈ చిత్రం  మంచి ల‌వ్‌స్టోరీ అనీ, క్ల‌యిమాక్స్ చిత్రానికి హైలైట్‌ అనీ, ప్ర‌తి అబ్బాయి ఈ సినిమా చూడాల‌ని అఖిల్ తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana MLC Constituencies: తుది ఓటర్ల జాబితా విడుదల.. వివరాలివే..

Black Moon: డిసెంబర్ 31, 2024.. బ్లాక్ మూన్‌ని చూడొచ్చు.. ఎలాగంటే?

ఉగాది నుండి అమలులోకి మహిళలకు ఉచిత బస్సు పథకం?

అపుడు బూతులు తిట్టి.. ఇపుడు నీతులు చెబితే ఎలా? : పేర్ని నానిపై పవన్ కళ్యాణ్ ఫైర్ (Video)

పేర్ని నాని భార్య జయసుధకు ఊరట, ముందస్తు బెయిల్ మంజూరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments