Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి, రవితేజ కాంబినేష‌న్‌లో భారీ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (16:49 IST)
mega154 set- bobby
మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర), మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్‌ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మెగా154.  మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబధించిన కీలకమైన భారీ షూటింగ్ షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. టీమ్ మొత్తం కొత్త షూటింగ్ షెడ్యూల్‌ లో పాల్గొంటున్నారు. కీలకమైన సన్నివేశాలని ఈ షెడ్యూల్‌ లో చిత్రీకరిస్తున్నారు.
 
మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ మునుపెన్నడూ చూడని మాస్-అప్పీలింగ్ , పవర్- ప్యాకెడ్ పాత్రలో మెగాస్టార్ ని చూపించబోతున్నారు. నేడు జ‌రుగుతున్న షూటింగ్‌కు సంబంధించిన వ‌ర్కింగ్ స్టిల్‌ను ద‌ర్శ‌కుడు బాబీ సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.
 
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగా 154కోసం ప్రముఖ నటులు, అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.
 
 మెగాస్టార్ చిరంజీవికి అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ లను అందించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మెగా 154కి సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.
ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.
2023 సంక్రాంతి కానుకగా మెగా154 ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments