Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాపం లాంటి కథతో హ్యాపీ ఎండింగ్ చిత్రం

Webdunia
శనివారం, 13 మే 2023 (18:06 IST)
A happy ending team with tammareddy
యశ్ పూరీ, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ ఎండింగ్'. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సిల్లీ మాంక్స్, హామ్స్ టెక్ ఫిల్మ్స్ నిర్మించారు. త్వరలోనే విడుదలకు ముస్తాబవుతున్న హ్యాపీఎండింగ్ టీజర్ ఈ రోజు విడుదల చేశారు.
 
హీరో యశ్ మాట్లాడుతూ,  ఇది నాకు మూడో సినిమా. సినిమా మీద ప్రేమతోనే ఈ హ్యాపీ ఎండింగ్ తీశాం. హ్యాపీ ఎండింగ్ అనేది కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్. అంటే పిల్లాడి నుంచి వ్యక్తిగా మారే కథ. ఈ  సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా ఒక పాత్రలాగే ఉన్నారు. ఇది ది బెస్ట్ టీమ్ అని చెబుతాను. వీరిని తెలుగు సినిమా భవిష్యత్ అని కూడా చెప్పొచ్చు   అన్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాత అనిల్ పల్లాల మాట్లాడుతూ,  మూడేళ్ల క్రితం దర్శకుడు కౌశిక్ మా దగ్గరకు వచ్చాడు. అప్పుడు అతను మా దగ్గరే ఓ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఆ టైమ్ లోనే యశ్ కూడా కలిశాడు. తర్వాత కౌశిక్ చెప్పిన ఓ లైన్ నచ్చి మళ్లీ పిలిపించాం. ఆ లైన్ నుంచి స్టార్ట్ అయిన సినిమానే ఈ హ్యాపీ ఎండింగ్. సినిమా చాలా బాగా వచ్చింది అన్నారు .
 
డివోపి అశోక్ మాట్లాడుతూ.. ''ఈ స్క్రిప్ట్ వినడానికి కౌశిక్ దగ్గరకు వెళ్లినప్పుడు అతను ఇది శాపాల గురించిన కథ అన్నాడు. అప్పుడు శాపాల మీద సినిమా ఏంటా అనుకున్నారు. బట్ నాకు తెలియని కొత్త కొత్త శాపాల గురించి చెప్పాడు. అందులోని ఒక శాపంకు సంబంధించిన కథే మన సినిమా అన్నాడు. అలాంటి ఒక శాపం ఇప్పుడున్న జెనరేషన్ లోని ఒక అబ్బాయి మీద పడితే అతని పరిస్థితేంటీ అనేదే సినిమా. ఈ టీజర్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను.నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన కౌశిక్, నిర్మాతలకు థ్యాంక్యూ." అన్నారు.
 
హీరో తిరువీర్ మాట్లాడుతూ.. " సిల్లీమాంక్స్ నాకు ఫస్ట్ గుర్తింపు తెచ్చిన జార్జ్ రెడ్డితో అసోసియేట్ అయి ఉన్న సినిమా. అందుకే నాకు ఈ బ్యానర్ స్పెషల్. టీజర్ చూడగానే చాలా హ్యాపీగా ఉంది. టీజర్ లో ఉన్న చిన్న కుర్రాడిని నేనే ట్రెయిన్ చేశానని గర్వంగా చెబుతాను. హ్యాపీ ఎండింగ్ టీమ్ కు డబ్బులు బాగా రావాలని.. అందరికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.." అన్నారు.
 
హీరో త్రిగుణ్‌ మాట్లాడుతూ .. "ఇక్కడికి పిలిచినందుకు హ్యాపీ. సిల్లీమాంక్స్ అనేది నాకు హోమ్ బ్యానర్ లాంటిది. ఇప్పుడు నేను ఇన్ని సినిమాలు చేయడానికి కారణం సిల్లీమాంక్స్. ఇప్పుడున్న సిట్యుయేషన్ లో మా లాంటి వాళ్లు హీరోలుగా చేయడం చాలా టఫ్‌. బట్ సిల్లీమాంక్స్ లాంటి బ్యానర్స్ ఉంటే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ హ్యాపీ ఎండింగ్ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ హ్యాపీ ఎండింగ్ సినిమాకు శుభం జరగాలని కోరుకుంటున్నాను.."అన్నారు.
 
హీరోయిన్ అపూర్వ రావు మాట్లాడుతూ .. " ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఇది నా డెబ్యూ ఫిల్మ్. కొత్తగా వచ్చే మాలాంటి వారికి మీడియా ఇంత సపోర్ట్ ఉన్నందుకు థ్యాంక్యూ. నేను ఒంగోలులో పుట్టి గుజరాత్, గల్ఫ్ లో పెరిగాను. స్టడీస్ తర్వాత హైదరాబాద్ వచ్చాను. చాలామంచి ప్యాసినేట్ మూవీ టీమ్ తో పనిచేశాను. డైరక్టర్ కౌశిక్ కల్ట్ ఫిల్మ్ మేకర్ అవుతాడు. ఈ సినిమాలో భాగం అయిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ చెబుతున్నాను.. ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.. "అన్నారు.
 
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, కొత్త వారిని సిల్లీమాంక్స్  ఎంకరేజ్ చేస్తోంది. వీళ్లందరికీ మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఎండింగ్ మూవీ టీమ్ కు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను.." అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డు నిర్మాణ నాణ్యతను స్వయంగా పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్! (Video)

అమెరికాలో అనుమానాస్పదస్థితిలో తెలుగు విద్యార్థి మృతి!!

kadapa: కుర్చీ కోసం నిల్చున్న కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఎక్కడ?

6G: టెక్నాలజీ పెరిగిపోతున్నా.. డిజిటల్ డార్కులో వున్న తెలంగాణ స్కూల్స్

Jagan: డిసెంబర్ 24 నుంచి కడప జిల్లాల్లో జగన్ పర్యటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments