నేను - కీర్తన చిత్రంతో హీరోగా చిమటా రమేష్ బాబుకు మంచి పునాది!

డీవీ
శనివారం, 10 ఆగస్టు 2024 (14:39 IST)
Nenu keertana team
చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన "నేను - కీర్తన" చిత్రం ప్రి రిలీజ్ మరియు ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో అత్యంత ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్ తోపాటు... ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు, ప్రముఖ మహిళామణులు శోభారాణి, పద్మినీ నాగులపల్లి, గిడుగు కాంతికృష్ణ, వాసిరెడ్డి స్పందన పాల్గొని, "నేను - కీర్తన" చిత్రం చిమటా రమేష్ బాబుకు హీరోగా తిరుగులేని పునాది వేయాలని అభిలషించారు. ట్రైలర్ లో సక్సెస్ కళ పుష్కలంగా కనిపిస్తోందని, ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న "నేను - కీర్తన" ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. 
 
చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు ("సి.హెచ్.ఆర్")ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన "నేను-కీర్తన" చిత్రాన్ని ఈనెల 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
హీరో కమ్ డైరెక్టర్ రమేష్ బాబు ఈ సందర్భంగా "నేను - కీర్తన" చిత్ర రూపకల్పనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తన సోదరి జ్యోతిర్మయి, తన జీవిత భాగస్వామి లక్ష్మీ కుమారిల సపోర్ట్ లేకుంటే... "నేను - కీర్తన" ఇంత అద్భుతంగా వచ్చేది కాదని పేర్కొన్నారు. ఒక మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడానికి అవసరమైన ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. తన సోదరుడు నటించిన సినిమా అని అనడం లేదని, "నేను-కీర్తన" పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చిత్ర సమర్పకురాలు చిమటా జ్యోతిర్మయి పేర్కొన్నారు. నిర్మాత చిమటా లక్ష్మీ కుమారి మాట్లాడుతూ... "ఎన్నో వ్యయప్రయాసలతో మల్టీ జోనర్ ఫిల్మ్ గా రూపొందించిన "నేను - కీర్తన" కచ్చితంగా నిరుపమాన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
తనదైన వ్యాఖ్యానంతో అనూష ఈ కార్యకమాన్ని రక్తి కట్టించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Heavy Rains: తిరుపతిలో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి పొంచివున్న తుఫాను ముప్పు

కర్నూలు దుర్ఘటన : కాలిపోయిన బస్సును తొలగిస్తున్న క్రేన్ బోల్తా.. డ్రైవర్‌కు .. (వీడియో)

పశ్చిమబెంగాల్: కోలాఘాట్‌లో ఐదేళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడి అత్యాచారం

కోటా మెడికల్ కాలేజీలో మరో ఆత్మహత్య.. పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఉరేసుకుని?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments