Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుట్ట బొమ్మ మరో రికార్డు : ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో...

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2020 (08:59 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. పూజా హెగ్డే హీరోయిన్ కాగా, ప్రముఖ నిర్మాతలు చినబాబు, అల్లు అరవింద్‌లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ సంగీత బాణీలు సమకూర్చారు. అయితే, ఈ చిత్రం గత సంక్రాంతికి విడుదలై ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా, ఈ చిత్రంలోని పాటలు మంచి పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా, బుట్టబొమ్మ పాట అయితే ఇప్పటికీ సంచలనమే. వ్యూస్, లైక్స్ అంటూ రోజూ ఏదో ఒక రికార్డ్ వార్త ఈ పాట గురించి వినిపిస్తూనే ఉంది. 
 
తాజాగా ఈ సాంగ్ 300 మిలియన్ ప్లస్ వ్యూస్ రాబట్టినట్లుగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తెలిపారు. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్డ్రీకి సంబంధించి ఏ పాటకు ఇంత క్రేజ్ రాలేదు. టిక్ టాక్ వంటి మాధ్యమాలతో ఈ పాట అంతర్జాతీయ స్థాయిలో కూడా వినబడింది. 
 
థమన్ సంగీతం, రామజోగయ్య సాహిత్యానికితోడు బన్నీ డ్యాన్స్, పూజా గ్లామర్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ అయ్యాయి. అందుకే యూట్యూబ్‌లో ఈ సాంగ్ విపరీతంగా క్రేజ్ అవుతోంది. ఇప్పుడీ పాట 300 మిలియన్ క్లబ్‌లోకి చేరి తెలుగు సినిమా స్థాయి ఏంటో మరోసారి చాటిచెప్పింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments