రెండు నెలలునాడు జీవితా రాజశేఖర్ చీటింగ్ చేశారని ఫైనాన్సియర్ కోటేశ్వరరాజు, హేమ అనేవారు కేసు పెట్టారు. అది మా లాయర్ చూసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు నేను దర్శకత్వం వహించిన `శేఖర్` సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా నాపై చీటింగ్ కేసు రావడం విడ్డూరంగా వుందని జీవితా రాజశేఖర్ అన్నారు. శుక్రవారంనాడు నగరి కోర్టు జీవితా రాజశేఖర్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చిందని వార్త వచ్చింది. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ శనివారంనాడు వివరణ ఇచ్చారు.
- వారెంట్ ఇచ్చామని అంటున్నారు. కానీ నాకు అదేమీ రాలేదు. నేను ఏ తప్పూ చేయలేదు. అలా చేస్తే 30 ఏళ్ళుగా సినిమా రంగంలో వుండేదాన్నికాదు. హేమ అనే ఆవిడ 26 కోట్లు మోసం చేశారని అంటున్నారు. బహుశా వేసుకునే కోట్లు అనుకుంటా. అసలు ఆర్థిక విషయాల్లో ఆమెకు సంబంధం లేదు. కోటేశ్వరరాజు అనే ఫైనాన్సియర్‌కే అన్నీ తెలుసు. మేం ఎటువంటి మోసం చేయలేదు. చేస్తే కోర్టు ఏది చేసినా ఓకే. అయినా నన్నెవరూ అరెస్ట్ చేయలేరు. నేను మీ ముందే తిరుగుతున్నా. ఒకప్పుడు `మా` ఎలక్షన్ సందర్భంగా మా కుటుంబం పేరు బయటకు వచ్చింది. ఇలా పలు సందర్భాల్లో మమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడంలేదు.
మీడియా కూడా ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. మా మీద కొందరు పని కట్టుకుని తప్పుడు భావన కలిగేలా సోషల్ మీడియాలో థంబ్ లైన్స్ పెడుతున్నారని అన్నారు. కోర్టు పరిధిలో ఆ విషయం ఉన్నందున ఎక్కువ మాట్లాడలేనని అన్నారు. గతంలో తాము ఎలాంటి డబ్బులూ కోటేశ్వరరాజుకు ఇవ్వనవసరం లేదని కోర్టు చెప్పిందని, ఇప్పుడు తాజాగా అతను చేస్తున్న ఆరోపణలలోనూ బలం లేదని ఆమె చెప్పారు.
సోషల్ మీడియాకానీ మరే మీడియాగానీ చిలువలు పలువలు చేస్తున్నారు. నిహారిక, మోహన్ బాబు గారి ఫ్యామిలీ గురించి కూడా చాలా దారుణమైన వార్తలను ట్రోల్ చేస్తున్నారని, తమ కుమార్తెల గురించి రకరకాల వార్తలను రాశారని అవన్నీ మానసికంగా ఎంతో బాధకు గురిచేస్తున్నాయని జీవిత అన్నారు పాజిటివ్ థింకింగ్‌తో తాను ముందుకు పోతానని, తామంటే నచ్చని వారెవరో వెనక నుండి ఇలాంటి పనులు చేస్తుంటారని ఆమె చెప్పారు.
శేఖర్ నిర్మాత శ్రీనివాస్
2017లోనే కోటేశ్వరరాజు మీద డీమానుటైజేషన్ కేసు ఉందని, పోలీసుల కళ్ళు గప్పి ఆయన తిరుగుతున్నారని శేఖర్ నిర్మాత శ్రీనివాస్ చెప్పారు. అసలు రూ.26 కోట్లు ఆయన ఎక్కడ నుండి తెచ్చి ఇచ్చారో కోటేశ్వరరాజు నిరూపించుకోవాల్సి ఉంటుందని శ్రీనివాస్ అన్నారు. జీవితకు- కోటేశ్వరరాజుకు మధ్య ఉన్న వివాదంలోకి తమ ఫైనాన్షియర్ బీరం సుధాకర్ రెడ్డి పేరు తీసుకురావడం దారుణమని చెప్పారు.