Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్కారు వారి పాట హిట్ అవుతుంది - 23న‌ టైటిల్ సాంగ్ విడుదల

Advertiesment
Mahesh Babu, Keerthi Suresh
, గురువారం, 21 ఏప్రియల్ 2022 (10:31 IST)
Mahesh Babu, Keerthi Suresh
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' పై అంచనాలు ఆకాశాన్ని  తాకుతున్నాయి. ఈ సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది. మా మైత్రీమూవీస్ బేన‌ర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను చూడబోతున్నామ‌ని చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన ఎర్నేని ర‌వి తెలియ‌జేశారు. ఈ సినిమాలో మూడ‌వ పాట‌నుకూడా ఈనెల 23న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో మూడో పాట టైటిల్ సాంగ్ ను ఈ నెల 23న ఉదయం 11.07 కు  విడుదల చేయనున్నారు. అదే పాట ట్యూన్ ని సినిమా టీజర్‌కి బీజీఎంగా కూడా ఉపయోగించడం మరో విశేషం. మ్యూజికల్ సెన్సేషన్  థమన్ ఈ ఆల్బమ్ కోసం అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లను కంపోజ్ చేశారు.
 
ప్రస్తుతం మహేష్ బాబు, కీర్తి సురేష్, డ్యాన్సర్లపై ఓ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అందిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ లో షూట్ చేస్తున్న ఈ పాట మాస్ సాంగ్ గా అలరించనుంది. ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
 
ఇప్పటికే కళావతి, పెన్నీ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలవడంతో ఆల్బమ్‌పై  భారీ అంచనాలు నెలకొన్నాయి.
అటు రిలీజ్ డేట్ కూడా దగ్గర పడటంతో రెగ్యులర్ అప్డేట్స్ తో ప్రమోషన్స్లో జోరు కొనసాగిస్తుంది చిత్ర యూనిట్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాస్త‌వ క‌థ ఆధారంగా 1996 ధర్మపురి - ప్రీరిలీజ్ వేడుక‌లో వ‌క్త‌లు