Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాల్లో 267 థియేటర్లలో విడుదల కానున్న సూర్య '24'

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (14:24 IST)
తమిళ స్టార్ హీరో సూర్య, విక్రం కుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ''24''. ఈ చిత్రంలో సూర్య త్రిపాత్రాభినయం పోషిస్తున్నవిషయం తెలిసిందే. టైం మిషన్ బ్యాక్ గ్రౌండ్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సూర్య హీరోగా, విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత, నిత్యా మీనన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. 
 
ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, పోస్టర్స్ సినిమా మీద భారీ అంచనాలను పెంచేశాయి. ఈ మధ్యనే ఆడియో రిలీజ్ కార్యక్రమం జరుపుకున్న సూర్య ''24'' మే 6న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఓవర్సీస్‌లో కూడా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 267 స్క్రీన్‌లలో అమెరికాలో రిలీజ్ చేయడానికి గెలాక్సి ఇంక్ సంస్థ ఏర్పాట్లు చేసింది.
 
మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా వస్తే ఇక్కడ కన్నా అక్కడ మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. రిలీజ్‌కు ఒక రోజు ముందు స్పెషల్ ప్రీమియర్ షోలను వేసే ఆలోచనలో ఉన్నట్టుగా యూనిట్ సభ్యులు తెలిపారు. భారీ అంచనాల నడుమ వస్తున్న సూర్య 24 ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలంటే మే ఆరో తేదీ వరకు ఆగాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

Ganga river: గంగానదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చున్నీతో కాపాడిన మహిళ (video)

Policemen: డ్యూటీ సమయంలో హాయిగా కునుకుతీసిన పోలీసులు.. అలా పట్టుబడ్డారు..

పాకిస్తాన్ మంత్రి హసన్ లంజార్ ఇంటికి నిప్పు, దరిద్రుడు మా నీళ్లు మళ్లిస్తున్నాడంటూ సింధ్ ప్రజలు ఫైర్

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments