Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజువ‌ల్ వండ‌ర్ 2.0 చిత్ర ట్రైలర్‌ రిలీజ్.. 18 కేజీల బరువు కాస్టూమ్స్‌లో రజనీ (video)

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (13:07 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రతి నాయకుడిగా, ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ 2.0 చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. చెన్నైలోని స‌త్యం సినిమాస్ ట్రైల‌ర్ లాంచ్‌ని అట్టహాసంగా నిర్వహిస్తోంది. ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్‌, ఏఆర్ రెహ‌మాన్‌, శంక‌ర్, అమీ జాక్స‌న్ త‌దిత‌రులు ఈ కార్య‌క్రమానికి హాజ‌ర‌య్యారు. 
 
ట్రైలర్‌ని 4 డీ సౌండ్ టెక్నాలజీతో విడుదల చేశారు. రెసుల పూకుట్టి సాయం వ‌ల‌న తన క‌ల నెర‌వేరింది. 4డీ ఎఫెక్ట్ మ‌న సీటు కింద‌నే స్పీకర్స్ ఉన్నాయా అనే ఫీల్‌ని క‌లిగిస్తుంద‌ని శంక‌ర్ చెప్పారు. న‌వంబ‌ర్ 29న తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ చిత్రం అనేక రికార్డులు తిర‌గ‌రాస్తుంద‌ని శంకర్ ధీమా వ్యక్తం చేశారు. 
 
లాంచ్ కార్య‌క్ర‌మంలో ఏఆర్ రెహ‌మాన్ మాట్లాడుతూ.. ఎందిర లోగ‌త్తు అనే సాంగ్ విజువ‌ల్ ట్రీట్‌గా ఉంటుందని అన్నారు. ర‌జ‌నీకాంత్ ఎప్ప‌టికి తన ఫేవ‌రేట్‌ హీరో. అత‌ని వ్య‌క్తిత్వం అంద‌రికి స్ఫూర్తినిస్తుంది. ఈ వ‌య‌స్సులోను ప‌నిపై అత‌నికున్న ఆస‌క్తిని తాను గౌర‌విస్తాను. చిత్రంలో 18 కేజీల బ‌రువున్న కాస్ట్యూమ్‌ని ర‌జ‌నీ ధరించారని కొనియాడారు. 
 
ఈ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం అనేక సవాళ్లు ఎదుర్కొన్నా. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సినిమాలో తనకు అవకాశం ఇచ్చిన శంకర్‌ సర్‌, రజనీ సర్‌కు ధన్యవాదాలు తెలిపాకు. తన 28 ఏళ్ల కెరీర్‌లో వేసుకున్న మొత్తం మేకప్‌ ఈ ఒక్క సినిమాలో వేసుకున్నా. మేకప్‌ తర్వాత ఆ పాత్రలో తనను చూసి షాకైపోయా. 
 
మేకప్‌ వేసుకోవడం కోసం మూడు గంటల సమయం పడితే, తీయడానికి గంటన్నర సమయం పట్టేది. శంకర్‌ కేవలం దర్శకుడు మాత్రమే కాదు, గొప్ప శాస్త్రవేత్త కూడా. సినిమా షూటింగ్‌ సమయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని అక్షయ్ కుమార్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజూ వచ్చి కనబడి వెళ్తా: బిగ్ టీవీ రిపోర్టర్‌కి కొడాలి నాని షాక్ (Video)

జనసేన ఆవిర్భావ మహానాడుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!!

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments