Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి సక్సెస్‌కు కారణం రాజమౌళి కాదా.. '2.O' హీరో రజనీకాంత్

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (10:48 IST)
శంకర్ దర్శకత్వంలో తాను హీరోగా నటించిన '2.O' చిత్రం దేశం గర్వించదగ్గ మూవీ అవుతుందని సూపర్ స్టార్ రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో డైరెక్టర్ శంకర్‌తో పాటు ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, రజనీకాంత్‌లు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ, రోబో చిత్రం విడుదలై 9 యేళ్లు అవుతుంది. ఆ సినిమా ఆడియో సమయంలో శంకర్‌ నాకు తెలుగు తెలియదని చెప్పి ఇంగ్లీష్‌లో మాట్లాడారు. ఇప్పుడు ఆయన చాలా చక్కగా తెలుగులో మాట్లాడటం నేర్చుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. 
 
తెలుగు జనాలు చాలా మంచివాళ్లు. వాళ్లని అందరూ ఇష్టపడతారు. తెలుగు భోజనం లోక ప్రసిద్ధి. తెలుగు మ్యూజిక్‌ ఆనందమైంది. తెలుగు గొప్పతనాన్ని మహాకవి భారతీయారే కొనియాడారు. తెలుగు అమ్మాయిలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోబోను చేసినప్పుడు పూర్తి సినిమాను త్రీడీగా మార్చాలనుకున్నాం. కానీ కుదరలేదు. ఓ రీల్‌ను త్రీడీలో మార్చి చూసిన తర్వాత శంకర్‌ అప్పుడే త్రీడీలో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారని వివరించారు. 
 
ఇందుకోసం ఓ మంచి కథ కోసం వెయిట్‌ చేశారు. మూడు నాలుగేళ్ల ముందు త్రీడీల సినిమా చేద్దామని అనగానే మంచి కథ దొరికేసిందని అనుకున్నాను. ఆయనతో నేను పనిచేసి ఉన్నాను కాబట్టి ఇది సాధ్యమా? అనే సందేహం రాలేదు. 'బాహుబలి' అంత పెద్ద సక్సెస్‌ కావడానికి కారణం మంచి సబ్జెక్ట్‌ అందుకు తగిన బ్రహ్మాండం. రెండు కలిసింది కాబట్టే బాహుబలి పెద్ద సక్సెస్‌ అయ్యిందని రజనీకాంత్ వివరించారు.
 
ఇకపోతే, 2.O మూవీ విషయానికి వస్తే టెక్నాలజీ, త్రీడీ కరెక్ట్‌ అయిన సబ్జెక్ట్‌ కాంబినేషన్‌ కుదిరింది. 100 శాతం సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందనే నమ్మకం నాకుంది. శంకర్ అడిగినవన్నీ సమకూర్చిన నిర్మాత సుభాష్‌కరణ్‌కి ధన్యవాదాలు. ఈ సినిమాకు ప్రమోషనే అక్కర్లేదు. ప్రసాద్‌ ఊరికే డబ్బు వేస్ట్‌ చేస్తున్నారు. ఆల్‌ రెడీ సినిమాపై అంచనాలు ఎక్కడో ఉన్నాయి. సినిమా ఎప్పుడొస్తుందా? అని అందరూ వెయిట్‌ చేస్తున్నారు. సినిమా చూసిన తర్వాత.. చూసినవాళ్లే సినిమాను ప్రమోట్‌ చేస్తారని నేను చెన్నైలోనే చెప్పినట్టు రజనీ వెల్లడించారు. 
 
1975లో నేను నటించిన తొలి చిత్రం 'అపూర్వరాగంగల్‌' సినిమాను చూడాలని ఎంత ఉబలాటపడ్డానో.. 43 ఏళ్ల తర్వాత "2.0" కోసం అంతే అతృతగా ఉంది. ఇందులో 45 శాతం విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. ఇప్పుడు మేకింగ్‌, ట్రైలర్‌లో, సాంగ్స్‌లో చూసినవన్నీ శాంపిల్సే. ఇది ట్రైలర్‌ మాత్రమే. మీరు ఆశ్చర్యపోయేలా గ్రాఫిక్స్‌, బ్రహ్మాండం అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. '2.0' మన సినిమా ఇండస్ట్రీకే చాలా గర్వ పడే చిత్రం. శంకర్‌ చెప్పినట్లు ఈ సినిమాను త్రీడీలో చూస్తే ఆ ఎఫెక్టే మరోలా ఉంటుంది. నేను కూడా నవంబరు 29వ తేదీ కోసం ఎదురు చూస్తున్నట్టు రజనీకాంత్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

ఆవు - పాము స్నేహం.. నెట్టింట వీడియో వైరల్

శ్రీతేజ్‌ మెదడుకు డ్యామేజీ జరిగిందంటున్న వైద్యులు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments