పక్షిరాజా ముందు తేలిపోయిన చిట్టి? : '2.O' మూవీకి 4 స్టార్ రేటింగ్

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (13:51 IST)
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "2.O". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్రంలో హీరో రజనీకాంత్, విలన్ అక్షయ్ కుమార్‌ల నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది. వీరిద్దరి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని పేర్కొంటూ అనేక మంది సినీ విమర్శకులు ఈ చిత్రానికి ఫోర్‌స్టార్ రేటింగ్ ఇస్తున్నారు. అయితే, అక్షయ్ యాంగ్రీ విలనిజం ముందు చిట్టి తేలిపోయాడని కొందరు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. 
 
ముఖ్యంగా, ప్రముఖ సినీ విమర్శకుడు, సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు తన రివ్యూలో ఈ చిత్రానికి 4 స్టార్ రేటింగ్ ఇచ్చి, ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ చిత్రం గురించి చెప్పాల్సివస్తే ప్రధానంగా హీరో, విలన్ పాత్రల గురించే తొలుత చెప్పుకోవాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా, అక్షయ్ కుమార్ యాంగ్రీ విలన్‌గా అదరగొట్టాడని పేర్కొన్నారు. 
 
వీటితోపాటు వీఎఫ్‌ఎక్స్, సౌండ్, సినిమాటోగ్రఫీ మరీ ముఖ్యంగా స్క్రీన్ ప్లే అద్భుతమని, భారతీయ దర్శకుడు తన కలను నెరవేర్చుకునేందుకు చూపిన తెగువ ప్రశంసించదగినదని రాశారు. పైగా, '2.O' తప్పకుండా చూడాల్సిన చిత్రమన్నారు. 
 
నేడు దీన్ని బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌గా పిలవాలన్నారు. కానీ, రేపటి నుంచి మాత్రం ఇది ఓ క్లాసికల్‌గా గుర్తుండిపోతుందన్నారు. '2.O' ఫాదర్ ఆఫ్ ఆల్ మూవీస్ అని ఈ చిత్రం మైండ్‌లో ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందని ఉమైర్ సంధు రాసిన రివ్యూలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

శ్రీవారి ప్రసాదం ధర పెంపు? క్లారిటీ ఇచ్చిన తితిదే చైర్మన్

ఇన్‌స్టాగ్రాంలో ఎవడితో చాటింగ్ చేస్తున్నావ్, భర్త టార్చర్: వివాహిత ఆత్మహత్య

అద్దెకి ఇచ్చిన ఇంటి బాత్రూంలో సీక్రెట్ కెమేరా పెట్టిన యజమాని, అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments