Webdunia - Bharat's app for daily news and videos

Install App

16-ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్ పేరిట తమిళ బ్లాక్‌బస్టర్.. మార్చి తొలివారంలో రిలీజ్

శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ సంస్థ నుంచి వ‌రుస‌గా క్రేజీ సినిమాలు రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ కోవ‌లోనే త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ "ధురువంగ‌ల్ ప‌దినారు(డి-16) తెలుగులో "16-ఎవ్వెరీ డీటెయ

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (19:13 IST)
శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ సంస్థ నుంచి వ‌రుస‌గా క్రేజీ సినిమాలు రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ కోవ‌లోనే త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ "ధురువంగ‌ల్ ప‌దినారు(డి-16) తెలుగులో "16-ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్‌"పేరుతో రిలీజ్ చేయ‌నున్నారు. రెహ్మాన్ హీరోగా న‌టించిన ఈ చిత్రానికి కార్తీక్ న‌రేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ధృవ సినిమాలో అర‌వింద్ స్వామి పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పిన సింగ‌ర్ కమ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేమ‌చంద్ర ఈ చిత్రంలో హీరో పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పారు.  ఇటీవ‌ల రిలీజైన ఫ‌స్ట్‌లుక్‌కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. మార్చి తొలివారంలో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి మాట్లాడుతూ- త‌మిళంలో ఇటీవ‌ల రిలీజై ఇప్ప‌టికీ విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న `ధ‌రువంగ‌ల్ ప‌దినారు` చిత్రాన్ని తెలుగులో `16-ఎవ్వెరి డీటెయిల్ కౌంట్స్‌` పేరుతో అనువ‌దించాం. డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. మార్చి తొలివారంలో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం. హాలీవుడ్ స్థాయిలో ఉత్కంఠ‌భ‌రితంగా తెర‌కెక్కిన థ్రిల్ల‌ర్‌కి త‌మిళ‌నాట‌ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

అక్క‌డ‌ ఇప్ప‌టికీ చ‌క్క‌ని వ‌సూళ్ల‌తో దూసుకెళుతోంది. వాస్త‌వానికి ఈ సినిమాని టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు ప్ర‌ముఖ నిర్మాత‌లు, హీరోలు నేరుగా తెలుగులో రీమేక్ చేసే ఉద్ధేశంతో భారీ మొత్తాల్ని వెచ్చించి చేజిక్కించుకోవాల‌నుకున్నా.. పోటీప‌డి మ‌రీ చేజిక్కించుకున్నాం. అందుకు త‌గ్గట్టే తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించే చిత్ర‌మిది`` అన్నారు. కెమెరా:సుజిత్ స‌రంగ్, సంగీతం: జాకేష్ బిజోయ్.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments