Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేహద్ షూటింగ్‌లో ఫైర్.. కొంగును లాగి హీరో బయటికొచ్చేశాడు.. కానీ ఆమెను కాపాడాడు..?! (Video)

హిందీ సీరియల్ ''బేహద్'' షూటింగ్‌ సెట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నటి జెన్నిఫర్‌ను కాపాడబోయిన కుషాల్‌కు స్వల్ప గాయాలు ఏర్పడ్డాయి. ఈ సీరియల్‌లో బుల్లితెర నటులు కుషాల్‌ టాండన్‌, జెన్నిఫర్

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (18:59 IST)
హిందీ సీరియల్ ''బేహద్'' షూటింగ్‌ సెట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నటి జెన్నిఫర్‌ను కాపాడబోయిన కుషాల్‌కు స్వల్ప గాయాలు ఏర్పడ్డాయి. ఈ సీరియల్‌లో బుల్లితెర నటులు కుషాల్‌ టాండన్‌, జెన్నిఫర్‌ వింగెట్‌ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
 
అసలు సన్నివేశం ఏంటంటే.. కల్యాణ మండపంలో మంటలు చెలరేగుతాయి. ఆ సమయంలో జెన్నిఫర్‌ అక్కడే కూర్చుని ఉంటుంది. కుషాల్‌ అక్కడికి వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఉన్నట్టుండి మంటలు అనుకున్న దానికంటే చెలరేగిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మండపం నుంచి జెన్నిఫర్‌ను నిజంగా రక్షించడానికి ప్రయత్నించడంతో కుషాల్‌ మెడకు, కాళ్లకు గాయాలయ్యాయి. 
 
తొలుత కుషాల్‌ను కాపాడేందుకు ఆమెను కొంగుతో లాగి మండపం నుంచి బయటికి వచ్చేస్తాడు. కానీ ఆమె మాత్రం అక్కడే ఉండిపోతుంది. కానీ మళ్లీ ఆమె కోసం వెనక్కి వెళ్లి కాపాడే ప్రయత్నంలో గాయపడ్డాడు. ఈ సందర్భంగా జెన్నిఫర్ కుషాల్‌కు ధన్యవాదాలు తెలిపింది.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments