Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్‌, మహేష్‌బాబు సినిమా కోసం 10కోట్లతో సెట్‌

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2023 (11:13 IST)
trivikram, mahesh
త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్‌.ఎస్‌.ఎం.బి.28 పేరుతో ఈ సినిమా షూటింగ్‌ కూడా ఆరంభమైంది. రెండు షెడ్యూల్స్‌ కూడా చేశారు. సారథి స్టూడియోస్‌తోపాటు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కొన్ని సన్నివేశాలు చిత్రించారు. ఈ చిత్ర ఎక్కువ భాగం అధునాతమైన భవంతిలోనే జరుగుతుంది. అందుకే దానికోసం మాదాపూర్‌ శివార్లో 10కోట్లతో సెట్‌ వేస్తున్నారని చిత్ర యూనిట్‌ లీక్‌ చేసింది. ఎ.ఎస్‌. ప్రకాష్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ఈ సెట్‌ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే మూడుభాగాలుగా దీన్ని నిర్మించారు. కొద్దిరోజుల్లో ఇది పూర్తికానుంది. శివరాత్రి తర్వాత ఇక్కడ షూటింగ్‌ చేయనున్నట్లు సమాచారం.
 
త్రివిక్రమ్‌ సినిమాలంటేనే అత్తారింటికి దారేది, అఆ, అలవైకుంటపురంలో.. సహా పలు సినిమాల్లోనూ ఇంటికి ప్రత్యేకత ఇస్తారు. దానికోసం కొన్ని సహజమైన ఇండ్లలో ఆయన చేసిన సందర్భాలున్నాయి. కానీ ఈసారి ఓ సెట్‌ వేయాల్సివచ్చింది. ఇందుకు నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమాకు థమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఆమధ్య సర్కారివారి పాట చిత్రం షూట్‌ దశలో దుబాయ్‌లో వున్న మహేష్‌ను త్రివిక్రమ్‌, థమన్‌ కూడా కలిసి ట్యూన్స్‌ ఓకే చేయించారు. అన్ని అనుకూలిస్తే ఆగస్టులో చిత్రం విడుదలకాబోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments