Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరి కొత్త ప్రేమ కథగా కృష్ణగాడు అంటే ఒక రేంజ్

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2023 (10:47 IST)
Rishwi Thimmaraju and Vismaya Sri
ప్రేమ కథ చిత్రాలు ఎప్పుడూ సక్సెస్ ఫుల్‌ ఫార్మూలానే. ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఇక కొత్త వాళ్లతో ప్రయోగాలు చేసే సమయంలో అందరూ ప్రేమ కథలనే ఎంచుకుంటారు. ఇప్పుడు అలాంటి ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతోనే కొత్త హీరో హీరోయిన్ ను  పరిచయం చేస్తూ 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' అనే సినిమాను శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ మీద పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్నో చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన రాజేష్ దొండపాటి ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు.
 
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్ గా  నటిస్తున్న కృష్ణగాడు అంటే ఒక రేంజ్ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ ప్రారంభించింది. ఈ క్రమంలో సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్  రిలీజ్ చేసారు . అనంతరం చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉందని ప్రశంసించారు.
 
వివి వినాయక్ రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చూస్తుంటే డైరెక్టర్ రాజేష్‌ మంచి సక్సెస్ కొట్టబోతున్నట్టుగా కనిపిస్తోంది.
 
ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి కావాల్సిన సంగీతాన్ని సాబు వర్గీస్ అందించారు. పాటలు, ఆర్ఆర్ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేట్టు కనిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌లోని బీజీఎం కూడా అందరినీ కట్టిపడేసేలా ఉంది. ఎస్ కే రఫి కెమెరాపనితనం ఈ సినిమాకు కలిసి వచ్చేలా ఉంది.
 
రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ వంటి వారు నటిస్తున్న ఈ సినిమాకు ఎడిటర్‌గా సాయి బాబు తలారి పని చేస్తున్నారు. ఈ చిత్రానికి వరికుప్పల యాదగిరి పాటలు రచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments